iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్‌కు పండగ.. మరోసారి బిగ్ స్క్రీన్‌పై ప్రభాస్-అనుష్క..!

  • Published Feb 10, 2024 | 1:20 PM Updated Updated Feb 10, 2024 | 1:20 PM

సిల్వర్ స్క్రీన్ పై ది మోస్ట్ ఎంటర్ టైన్ మెంట్ జోడిగా పేరు తెచ్చుకున్నారు ప్రభాస్- అనుష్క. ఈ రీల్ జోడి ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో అలరించింది. మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఓ ఇంటస్ట్రింగ్ న్యూస్ ..

సిల్వర్ స్క్రీన్ పై ది మోస్ట్ ఎంటర్ టైన్ మెంట్ జోడిగా పేరు తెచ్చుకున్నారు ప్రభాస్- అనుష్క. ఈ రీల్ జోడి ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో అలరించింది. మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఓ ఇంటస్ట్రింగ్ న్యూస్ ..

  • Published Feb 10, 2024 | 1:20 PMUpdated Feb 10, 2024 | 1:20 PM
ఫ్యాన్స్‌కు పండగ.. మరోసారి బిగ్ స్క్రీన్‌పై ప్రభాస్-అనుష్క..!

వెండితెరపై ది బెస్ట్ జోడీగా పేరు పడ్డ జంట ప్రభాస్-అనుష్క. ఈ పెయిర్ ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో జత కట్టింది. తొలి సారిగా బిల్లా, ఆ తర్వాత మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాల్లో వీరి జోడి చూసి ముచ్చటపడిపోయారు ఫ్యాన్స్. డార్లింగ్‌కు సరి జోడి అనుష్కనే, స్వీటీకి కూడా ఫర్‌ఫెక్ట్ స్క్రీన్ పార్టనర్ యంగ్ రెబల్ స్టారే అనేంతలా ఈ ద్వయం ఆకట్టుకున్నారు. మరీ ఇన్ని సినిమాలు చేశాక రూమర్స్ రాకుండా ఆగవు కదా.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిని ఖండిస్తూ వస్తున్నారు ఇద్దరూ. తాము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు. రియల్ లైఫ్‌లో కూడా ఈ జంట ఒక్కటైతే బాగుంటుందని ఆశపడే అభిమానులున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో.

బాహుబలి 2 తర్వాత ఇద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీ బిజీగా ఉన్నారు. భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి.. మిస్టర్ పోలి శెట్టి మూవీలతో స్వీటీ అలరించగా.. డార్లింగ్ ప్రభాస్ సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ మూవీలతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా లైనప్ చాలా పెద్దగానే ఉంది. రాజా సాబ్, కల్కి, స్పిరిట్, సలార్-2 కాకుండా హను రాఘవపూడితో మరో సినిమా ఓకే చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనుష్క శెట్టి నుండి మూవీ అప్ డేట్స్ రావడం లేదు. అయితే బరువు పెరగడమని గుసగుసలు వినిపించగా.. తాను కాస్త బ్రేక్ తీసుకోవాలనుకున్నానని.. అందుకే నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది ఈ అరుంధతి.

ప్రభాస్ బ్యానర్ యువీ క్రియేషన్స్‌‌లో మిస్ శెట్టి.. మిస్టర్ పోలి శెట్టితో నటించిన ఆమె మలయాళంలో కథనార్ అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ వర్క్ స్టార్ అయ్యింది. 10 రోజుల పాటు ఒడిశాలో షూటింగ్ జరిగింది. ఈ సినిమా గురించి ఎటువంటి సమాచారం బయటకు రాకూడదని భారీ భద్రత కల్పించారని తెలుస్తోంది. ఈ క్రమంలో మరో వార్త బయటకు వస్తుంది. క్రిష్ మూవీతో పాటు యువీ క్రియేషన్స్ లో మరో కొత్త చిత్రం షురూ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన అనుష్క నటించబోతుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే.. ఆరేళ్ల తర్వాత మోస్ట్ వాంటెడ్ రీల్ కపుల్..జోడి కట్టినట్లు అవుతుంది.  అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ కలిసి నటించాలని ఈగర్లీ వెయిట్ చేస్తున్న ప్రనుష్క అభిమానులకు పండగ లాంటి వార్త కావడం ఖాయం. ఏమంటారు ఫ్యాన్స్..?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş