iDreamPost
android-app
ios-app

మాస్ రాజా సరసన బుట్టబొమ్మ.. ఏ సినిమాలో అంటే..?

  • Author ajaykrishna Published - 02:49 PM, Sat - 22 July 23
  • Author ajaykrishna Published - 02:49 PM, Sat - 22 July 23
మాస్ రాజా సరసన బుట్టబొమ్మ.. ఏ సినిమాలో అంటే..?

ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ కాంబినేషన్స్ ఎప్పుడు ఎలా సెట్ అవుతాయో ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయలేరు. కొన్ని కాంబినేషన్స్ అంచనా వేయొచ్చు. కానీ.. అనుకోకుండా కొన్ని కుదిరిపోతాయి. అలాంటివి ఖచ్చితంగా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ లో ఊహించని కాంబో సెట్ అయినట్లు తెలుస్తోంది. కనీసం వీరి కాంబినేషన్ గురించి ముందస్తు సమాచారం కూడా అందలేదు అంటే చూడండి. అవును.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది మాస్ రాజా రవితేజ, బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి. ధమాకా తర్వాత రవితేజ చాలా బిజీ అయిపోయాడు. టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియా యాక్షన్ మూవీ చేస్తున్నాడు.

అది కాకుండా సినిమాటోగ్రాఫర్ కం డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో ఈగల్ అనే మూవీ చేస్తున్నాడు. ఓవైపు ఇవి షూటింగ్ దశలో ఉండగానే.. తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో నాలుగో సినిమా అనౌన్స్ చేశాడు. బహుశా అది క్రాక్ 2 అయ్యుండొచ్చు. ఎందుకంటే గతంలో డైరెక్టర్ క్రాక్ సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. ఇక ఆ సినిమా కాకుండా మరో స్టార్ డైరెక్టర్ తో కొత్త సినిమా రెడీ అవుతోందట. దానికి సంబంధించి వివరాలు ఏం బయటికి రాలేదు. కానీ.. మూవీకి సంబంధించి ఏర్పాట్లు అన్ని వేగంగా జరుగుతున్నాయట. అన్ని సెట్ అయితే.. అందులో రవితేజని హీరోగా, పూజా హెగ్డేని హీరోయిన్ గా ఖరారు చేసే ఆలోచనలు ఉన్నాయట.

ఇదిలా ఉండగా.. ఓవైపు చేతినిండా సినిమాలతో రవితేజ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మరోవైపు పూజ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఎందుకంటే.. గతేడాది వరుసగా బీస్ట్, రాధేశ్యామ్ సినిమాలతో ఫ్లాప్స్ ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ ఏడాది సల్మాన్ ఖాన్ తో చేసిన ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ మూవీ కూడా ప్లాప్ అయింది. దీంతో కొత్తగా ఏమి అవకాశాలు రాకపోగా.. చేతిలో ఉన్న క్రేజీ సినిమా నుండి తప్పుకుంది అమ్మడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ గుంటూరు కారం. ఈ సినిమాలో ముందుగా పూజానే మెయిన్ హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. అన్ని కుదిరాయి అనిపించారు. కానీ సడన్ గా ఏమైందో గాని ప్రాజెక్ట్ నుండి పూజా తప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు లేకుండా పోయాయి. సో.. రవితేజతో అయినా కన్ఫర్మ్ అవుతుందేమో చూడాలి. మరి ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş