iDreamPost
android-app
ios-app

సీక్రెట్ ప్లేస్ లో జానీ మాస్టర్ కు విచారణ.. నేడు కోర్టులో..!

  • Published Sep 20, 2024 | 9:11 AM Updated Updated Sep 20, 2024 | 9:11 AM

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్ననే గోవాలో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి జానీని ఓ సీక్రెట్ ప్లేస్ లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది.

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్ననే గోవాలో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి జానీని ఓ సీక్రెట్ ప్లేస్ లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది.

  • Published Sep 20, 2024 | 9:11 AMUpdated Sep 20, 2024 | 9:11 AM
సీక్రెట్ ప్లేస్ లో జానీ మాస్టర్ కు విచారణ.. నేడు కోర్టులో..!

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. ప్రస్తుతం ఈ పేరు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. ఈయన 21 ఏళ్ల అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై పలమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఇతనిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ విషయం పై ఆ మహిళ కోరియోగ్రాఫర్ జానీపై.. నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసింది. దీంతో జానీ బాషాపై ఐపీసీ 376(2), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే.. ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక జానీపై వచ్చిన లైంగిక ఆరోపణలపై పలపురు సినీ సెలబ్రిటీస్ కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. అలాగే జానీ భర్య అయోషా కూడా తన భర్త అలాంటి వాడు కాదని.. కావలనే తనపై కుట్ర చేస్తున్నారని ఓ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను నిన్న గోవాలోని ఓ లాడ్జీలో ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గోవా నుంచి హైదరాబాద్ కు తరలించిన జానీకి మాస్టర్ కేసులో ఓ కీలక సమాచారం వైరల్ గా మారింది. అందేంటో తెలుసుకుందాం.

నిన్ననే గోవాలోని ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని, అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతనిని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ కు తరలించారు. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ కు ఈ కేసు సంబంధించి విచారణ అనేది పోలీసులు ఓ సీక్రెట్ ప్లేస్ లో చేస్తున్నారనే సమాచారం . నగర శివారులోని ఉన్న ఓ ఫాంహోజ్లో జానీ మాస్టర్ ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గోవా కోర్టు ఆదేశాల మేరకు.. ఇవాళే జానీ మాస్టర్ ను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరుచనున్నారు.

ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ అరెస్ట్ కు తన భార్య అయోషానే కారణమంటూ ఓ వైపు టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భర్త అచూకీ తెలపాలని పోలీసులు అయోషాను విచారించడంతో.. జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నారో ఆమె చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ప్రత్యేక బృందం గోవాలో ఉన్న   జానీని అదుపులోకి తీసుకున్నారు. అయితే జానీని పోలీసులకు పట్టించింది అతని భార్య అనే విషయం పై  ఇప్పటికే స్పష్టంగా సమాచారం అందలేదు. మరి, జానీ మాస్టర్ కు ఈ కేసుకు సంబంధించి రహస్యంగా పోలీసులు విచారిస్తుండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet