60 ఏళ్ల నిర్మాత కమిట్మెంట్! హీరోయిన్ సంచలన స్టేట్మెంట్!

Pekamedalu Actress Anoosha Krishna పేక మేడలు మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కన్నడ కస్తూరి అనూష కృష్ణ. తొలి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది. తాజాాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.

Pekamedalu Actress Anoosha Krishna పేక మేడలు మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కన్నడ కస్తూరి అనూష కృష్ణ. తొలి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది. తాజాాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.

ఇండస్ట్రీలో హీరోయిన్లను వేధిస్తోన్న సమస్య క్యాస్టింగ్ కౌచ్. అవకాశాలు రావాలంటే కాంప్రమైజ్ కావాల్సిందేనని అపవాదు ఉంది. దీని వల్లే టాలెంట్ ఉన్నా కూడా ఎంతో మంది అమ్మాయిలు ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడిపోతున్నారు. అలాగే ఒకటి రెండు సినిమాలకు వెనక్కు వెళ్లిపోతున్నారు. మరికొంత మంది నటీమణులు తమ గళాన్ని విప్పి.. తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమేనని అంటున్నారు. ఇప్పుడు తాను దాని బాధితురాలినేనని చెబుతుంది వర్ధమాన నటి అనూష కృష్ణ. ఇటీవల పేక మేడలు అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి ఆమె కన్నడ అమ్మాయి. అయినప్పటికీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. ఇప్పుడు పేక మేడలు పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తుంది.

తాజాగా ఆమె ఓ ప్యాడ్ కాస్ట్‌లో పాల్గొని పలు విషయాలను పంచుకుంది. తెలుగు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పింది. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ చేసి.. హాబీగా థియేటర్ ఆర్టిస్ట్ చేసే సమయంలో అప్పుడు కన్నడలో ఓ మూవీ ఆఫర్ వచ్చిందని తెలిపింది. ‘యాక్టింగ్ కోసం ఉద్యోగాన్ని వదిలేశాను. ఇటు వైపు వస్తుంటే ఇంట్లో వాళ్లు వద్దన్నారు. కన్నడలో రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు’ అని చెప్పింది అనూష. ‘హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాక 70 సినిమాలకు పైగా ఆడిషన్ ఇచ్చాను. కొన్ని సార్లు మీరిలాగే చిన్న సినిమాలు చేస్తారా..? పెద్ద సినిమాలు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తుంటారు. నేను పెద్ద మూవీస్ చేయనా..? నాకంటూ కొన్ని పరిమితులున్నాయి. చిన్న సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పేదాన్ని’అని పేర్కొంది. అలాగే తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

‘ఓ మూవీ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు దర్శకుడు సెలెక్ట్ చేశారు. ప్రొడ్యూసర్ ను సంప్రదించండి అన్నాడు. ఆయనతో మాట్లాడితే.. మీరు బాగా నచ్చారు అన్నాడు. ఆయనకు 50-60 ఏళ్లు ఉంటాయి. ఓ క్లోజ్డ్ రూంలో కాంప్రమైజ్ అడిగాడు . కూతురు వయసున్న నాతో ఇలా మాట్లాడే సరికి షివరింగ్ వచ్చింది. వన్ అవర్ ఆలోచించుకోండి. మీకు మూవీ ఆఫర్ ఉంది అన్నాడు. నేను ఎంగేజ్డ్ అని చెప్పాను అయినా సరే.. నాకు ఓకే అన్నాడు. షేక్ అయ్యి.. వెంటనే బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయాను. కంగారు పడే సరికి ఏమైంది మామ్ అంటూ డ్రైవర్ అడిగాడు. అతను ఓదార్చాడు. నిర్మాత అలా అంటాడని నేను ఊహించలేదు. ఆ సమయంలో ఇక ఆడిషన్స్ వద్దు అనుకున్నంత మైండ్ సెట్‌కు వెళ్లింది. తర్వాత వచ్చిన మూవీలే చేద్దాంలే అనిపించింది.పేక మేడలు తర్వాత ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాను. డైరెక్టర్ సినిమా కోసం ఆలోచించి నిర్మాత ఇలా అడుగుతున్నాడన్న అసలు విషయాన్ని చెప్పలేదు’ అని వెల్లడించింది. ఇవే కాకుండా పలు విషయాలు పంచుకుంది అనూష కృష్ణ.

Show comments