iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్ OG గ్లింప్స్ వచ్చేసింది.. సుజిత్ పై ఫ్యాన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్!

  • Author ajaykrishna Updated - 11:39 AM, Sat - 2 September 23
  • Author ajaykrishna Updated - 11:39 AM, Sat - 2 September 23
పవన్ కళ్యాణ్ OG గ్లింప్స్ వచ్చేసింది.. సుజిత్ పై ఫ్యాన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్!

పదేళ్లుగా పవన్ కళ్యాణ్ నుండి సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ నుండి ఆ స్థాయి హిట్స్ రాలేదు. అప్పటినుండి పవన్ సినిమాలు ఫ్యాన్స్ కి నచ్చుతున్నా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టడం లేదు. అందులోనూ కొత్త సబ్జెక్టులతో రిస్క్ చేయకుండా వేరే సినిమాలను రీమేక్స్ చేస్తూ వస్తున్నాడు. దీంతో రీమేక్స్ కాకుండా కొత్త సబ్జెక్టుతో సినిమాలు కావాలని ఫ్యాన్స్ ఎప్పటినుండో రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. కాగా.. ఇప్పుడు ఫ్యాన్స్ దాహాన్ని దర్శకుడు సుజిత్ తీర్చే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తో OG అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా OG నుండి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. RRR ఫేమ్ దానయ్య డివివి ఈ సినిమా బిగ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మాఫియా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లో చేరుకున్నాయి. రీమేక్స్, హరిహర వీరమల్లు కాకుండా పవన్ ఎంచుకున్న పక్కా ఫ్రెష్ కమర్షియల్ సబ్జెక్టు ఇది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఓజి పైనే పడింది. ముందునుండి దర్శకుడు సుజిత్ పై ఫ్యాన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. అయితే.. తాజాగా విడుదలైన ఓజి గ్లింప్స్ చూసాక.. సుజిత్ ఈసారి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు అభిమానులు.

ఓజి గ్లింప్స్ పూర్తి స్థాయిలో ఫుల్ ఆన్ ఫైర్ లో సాగింది. పవన్ కళ్యాణ్ లుక్, మేనరిజం.. గన్స్.. రక్తపాతం.. బ్యాక్ గ్రౌండ్ లో అర్జున్ దాస్ బేస్ వాయిస్ అన్ని కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ని గ్యాంగ్ స్టర్ గా ఆల్రెడీ పంజా సినిమాలో చూశాం. కానీ.. కొత్తగా ఎండింగ్ లో పవన్ పోలీస్ స్టేషన్ లో మరాఠీ మాట్లాడటం.. కొత్తగా అనిపిస్తుంది. గ్లింప్స్ ప్రకారం.. ఓజి మూవీ ముంబై నేపథ్యంలో సాగనుందని అర్ధమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ లో చెప్పిన వాయిస్ తో పాటు సినిమాటోగ్రఫీ.. పవన్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్రెజెంట్ చేశాయి అనిపిస్తుంది. అందుకు తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు తమన్. గ్లింప్స్ చూస్తుంటే థియేటర్స్ లో ఊచకోత గ్యారంటీ అనిపించకమానదు. మరి ఓజి గ్లింప్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Giriş