Pawan Kalyan: అల్లు అర్జున్​కు థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్​.. భరోసా ఇచ్చావంటూ..!

Pawan Kalyan thanks to Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pawan Kalyan thanks to Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వేల మంది నిరాశ్రయులు అయ్యారు. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ నగరాలను వరదలు ముంచెత్తాయి. అక్కడి దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయి. ఈ భారీ విపత్తు నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ మెుత్తం కదిలింది. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ, తెలంగాణకు చెరో రూ. 50 లక్షలు విరాళాన్ని అందజేశాడు. కష్టకాలంలో వరద బాధితులకు అండగా నిలిచిన బన్నీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

“ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. వారి ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షల విరాళం ఇచ్చిన ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి, మీ గొప్ప మనసును చాటుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక మీరు చేసిన ఈ భారీ సహాయం ఎంతో మందికి భరోసా కల్పిస్తుంది” అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దాంతో అటు బన్నీ ఫ్యాన్స్.. ఇటు పవన్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా..  రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు అండగా తెలుగు చిత్ర పరిశ్రమ నిలిచింది. స్టార్లు ముందుకు వచ్చి.. తమ గొప్ప మనసును చాటుకుంటూ భూరి విరాళాలు ప్రకటించారు. వారందరికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. రామ్ చరణ్ ఇరు  రాష్ట్రాలకు చెరో రూ. 50లక్షలు, నాగార్జున ఫ్యామిలీ, అక్కినేని గ్రూప్ కంపెనీల తరఫున రూ . కోటి ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో 50 లక్షలు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రాష్ట్రాలకు చెరో కోటి చొప్పున భారీ విరాళం అందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెరో కోటి రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. వీరితో పాటుగా బాలకృష్ణ, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, వైజయంతి మూవీస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంటి మరికొందరు తమ గొప్ప సాయాన్ని ప్రకటించారు. తాజాగా ఫిలిం ఛాంబర్ కూడా తమ వంతు సాయం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. ప్రజలకు కష్టం వస్తే ముందుంటామని మరోసారి టాలీవుడ్ హీరోలు చాటి చెప్పారు. గతంలో చెన్నై వరదలు, ఇటీవలే కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా మన హీరోలు ముందుకు వచ్చి భారీ విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Show comments