iDreamPost
android-app
ios-app

పంజా మూవీలో హీరోయిన్ ఇంతలా మారిపోయిందేమిటీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల్లో ఒకటి పంజా. 2011లో వచ్చిన ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఇందులో హీరోయిన్ గా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల్లో ఒకటి పంజా. 2011లో వచ్చిన ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఇందులో హీరోయిన్ గా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా...?

పంజా మూవీలో హీరోయిన్ ఇంతలా మారిపోయిందేమిటీ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ లక్ పరీక్షించుకునేందుకు ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇక్కడకు వస్తుంటారు. అయితే కొంత మంది క్లిక్ అవుతుంటారు. తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టినప్పటికీ.. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక బ్యాగ్ సర్దేసుకుంటారు. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో.. తనకు ఛాన్స్‌లు ఇచ్చే ఇండస్ట్రీలోకి వెళ్లిపోతుంటారు. కానీ అలాంటి నటీమణుల్ని తర్వగా మర్చిపోలేరు తెలుగు ఆడియన్స్. వారిలో ఒకరు సారా జైన్ దియాస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా మూవీలో నటించింది ఈ బ్యూటీ. 2011లో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇందులో మరో హీరోయిన్‌గా అంజలి లావానియా నటించింది. ఇక ఇందులో పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. ‘వెయ్ రా చేయి వెయ్ రా, ఎలా ఎలా ఎలా.. నాలో కల చూపేదెలా, టైటిల్ సాంగ్, పాపరాయుడు’ సాంగ్స్ అదరగొట్టాయి. బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఇందులో సంధ్య క్యారెక్టర్లలో నటించింది. కాగా, ఆమె మస్కట్‌లో కొంకణీ ఫ్యామిలీలో జన్మించింది. 2007 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయ్యింది. ఆమె విద్యాభ్యాసం మస్కట్, ముంబయిలో పూర్తయ్యింది. నటి కాక ముందు ఆమె వి ఛానల్లో వీడియో జాకీగా వర్క్ చేసింది. 2010లో విశాల్ మూవీ తీర్థ విలయాట్టు పిల్లై చిత్రంలో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పంజా సినిమా ఆఫర్ వచ్చింది. హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మంచి పేరు తెచ్చుకుంది.

షారూఖ్ ఖాన్, దీపికా పడుకొణే హీరో హీరోయిన్లుగా నటించిన హ్యాపీ న్యూ ఇయర్ చిత్రంలో క్యామియో రోల్ చేసింది. యాంగ్రీ ఇండియన్ గాడెసెస్, జుబ్బాన్ వంటి చిత్రాలతో పాటు ఓ ఇంగ్లీష్ చిత్రంలోనూ నటించింది. ఇక వెబ్ సిరీస్‌లతో కూడా ఆకట్టుకుంటోంది. గత ఏడాది మేడిన్ హెవెన్, ద ప్రీలాన్సర్ వంటి సిరీస్‌లతో ఆకట్టుకుంటోంది. పంజా సినిమాలో చాలా సన్నగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మరింత నాజుగ్గా తయారయ్యింది. గతం కన్నా మరింత అందంగా కనిపిస్తుంది. సన్నజాజి తీగలాగా, జీరో సైజ్ మెయిన్ టైన్ చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా అమ్మడు భలే క్రేజ్. ట్రిప్స్, టూర్స్, సినిమాలు,ఇతర విషయాలను ఇన్ స్టా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన ఈ బ్యూటీ.. హిందీలో మాత్రం పాపులర్ అయ్యింది.