iDreamPost
android-app
ios-app

రెండో పెళ్లికి సిద్ధమైన నటి పావని.. టాటూ మాత్రం అలాగే..

  • Published Mar 16, 2024 | 6:20 PM Updated Updated Mar 16, 2024 | 6:20 PM

సినీ నటి పావని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెర, బుల్లితెర అంటూ హల్ చల్ చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయ్యింది. ఆమె మొదటి భర్త, సీరియల్ నటుడు ప్రదీప్ గతంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే..

సినీ నటి పావని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెర, బుల్లితెర అంటూ హల్ చల్ చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయ్యింది. ఆమె మొదటి భర్త, సీరియల్ నటుడు ప్రదీప్ గతంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే..

  • Published Mar 16, 2024 | 6:20 PMUpdated Mar 16, 2024 | 6:20 PM
రెండో పెళ్లికి సిద్ధమైన నటి పావని.. టాటూ మాత్రం అలాగే..

సీరియల్, సినీ నటి పావని రెడ్డిని టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా గుర్తు చేయనక్కర్లేదు. ప్రస్తుతం తమిళ బుల్లితెరపై రాణిస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో కూడా చాలా పాపులర్. తెలుగు, తమిళ్ సీరియల్స్‌తో పాటు సినిమాలు చేసింది. ఇప్పుడంటే ఆమె పేరు ట్రెండింగ్ కావడం లేదు కానీ.. 2015-17 మధ్య కాలంలో పావని రెడ్డి పేరు తెలుగు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. బుల్లితెర నటుడు ప్రదీప్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది అమ్మడు. పెళ్లైన కొన్ని నెలలకే 2017లో ఆమె భర్త ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమెతో గొడవ వల్లే అతడు మరణించారంటూ వార్తలు వినిపించాయి. ఏదీ ఏమైనప్పటికీ.. ఆ తర్వాత తెలుగు కన్నా తమిళ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టింది ఈ నటి.

తెలుగులో అడపా దడపా సీరియల్స్, సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఆమె తమిళ కొరియోగ్రాఫర్ అమీర్ ప్రేమలో పడింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న సమయంలో వీరికి పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. అయితే  వీరికి సీక్రెట్ పెళ్లి అయిపోయిందంటూ వార్తలు వినిపించాయి. ఒకానొక సమయంలో బ్రేకప్ అంటూ రూమర్స్ వచ్చాయి. అయితే తమిళ బీబీ జోడీ సీజన్ 2లో విన్నర్‌గా నిలిచిన ఈ జంట.. త్వరలో ఒక్కటి కాబోతున్నట్లు ఎనౌన్స్ చేసింది. కాగా, అమీర్, పావని రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఈ నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. కాగా,అమీర్‌తో రిలేషన్ షిప్ మెయిన్ చేస్తున్న తన మాజీ భర్త ప్రదీప్ టాటూను తొలగించలేదు పావని. దీనిపై అమీర్ స్పందించాడు. ‘ తనను తన భర్త చనిపోయిన బాధ ఇప్పటికీ ఉంది. అందుకే దాన్ని తొలగించమని నేనేప్పుడూ అడగలేదు. దాన్ని తొలగించే ఉద్దేశం ఆమెకు లేదు’ అని వెల్లడించాడు.

కాగా, పావని 2012లో బాలీవుడ్ మూవీ లాగిన్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగు, తమిళ చిత్రాలతో పాపులర్ అయ్యింది. గౌరవం, అమృతం చందమామ, ది ఎండ్ వంటి సినిమాల్లో నటించింది. అదే సమయంలో టీవీ సీరియల్స్ చేసింది. అగ్ని పూలు, నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్ చేస్తూనే.. తమిళనాడ బుల్లితెరపై కూడా మెరిసింది. తెలుగులో లజ్జా, ప్రేమకు రెయిన్ చెక్ చేశాక.. శ్రీమతి సీరియల్లో మెరిసింది. ఆ తర్వాత తమిళంలో వివిధ షోల్లో పార్టిసిపెంట్ చేసింది. కాస్త గ్యాప్ ఇచ్చి సేనా పతి అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది ఈ చిత్రం. మళ్లీ మొదలైంది.. చిత్రంలో కనిపించింది. అజిత్ తనివులో ఈ ప్రేమ జంట కనిపించారు. తాజాగా చారీ 111తో పలకరించింది ఈ బ్యూటీ. ఫ్యామిలీ మేటర్స్ అనే తెలుగు వెబ్ సిరీస్ చేస్తోంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş