iDreamPost
android-app
ios-app

మల్లెపూలు పెట్టుకుని బీచ్‌లో నిల్చొన్న ఈ నటి.. ఒక్క డైలాగ్‌తో ఫేమస్

  • Published Apr 12, 2024 | 3:58 PM Updated Updated Apr 12, 2024 | 3:58 PM

మల్లెపూలు పెట్టుకుని.. బీచ్‌లో అటు తిరిగి నుంచొని ఏదో తదేకంగా చూస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా..? ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఒక్క డైలాగ్‌తో ఆమెకు ఆ పేరు స్థిరపడిపోయింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?

మల్లెపూలు పెట్టుకుని.. బీచ్‌లో అటు తిరిగి నుంచొని ఏదో తదేకంగా చూస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా..? ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఒక్క డైలాగ్‌తో ఆమెకు ఆ పేరు స్థిరపడిపోయింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?

  • Published Apr 12, 2024 | 3:58 PMUpdated Apr 12, 2024 | 3:58 PM
మల్లెపూలు పెట్టుకుని బీచ్‌లో నిల్చొన్న ఈ నటి.. ఒక్క డైలాగ్‌తో  ఫేమస్

మల్లెపూలు పెట్టుకుని.. సముద్రపు ఒడ్డున నుంచొని తదేకంగా ఏదో చూస్తున్న అమ్మాయిని చూశారు కదా..‘ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయెనే’ అంటూ వర్ణించాలని అనిపిస్తుంది కదూ. ఆ అమ్మడు  ఇచ్చిన ఫోజులు అలా ఉన్నాయి మరీ. ఏదీ ఫేస్ కాస్త టర్నింగ్ ఇస్తే.. ఆ అమ్మడు ఎవరో దర్శించుకుందామని అనుకుంటున్నారు కదా. అయితే ఓ క్లూ. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరోయిన్. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో కూడా నటించింది. గుర్తిండిపోయే పాత్రల కోసం పరుగులు పెడుతోంది. ఒక్క డైలాగ్ ఆమెను పాపులర్ చేసింది. ఇంతకు ఆ డైలాగ్ చెబితే కచ్చితంగా గుర్తుపడతారు. ఇంతకు అదేంటంటే..?

‘సమోసా తింటావా శిరీష’ అని హీరో అడగ్గానే‘ ఆకలౌతలేదు నువ్వు తిను’ అని రిప్లై ఇస్తుంది ఈ బ్యూటీ. పరేషాన్ మూవీలోని ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలుసా.. ఆమెను ఎక్కడ చూసినా సమోసా తింటావా శిరీష అనే పిలుస్తున్నారు. ఆ శిరీషనే ఈ బ్యూటీ. ఇంతకు ఆమె పేరు ఏంటంటే.. పావని కరణం. షార్ట్ ఫిలిమ్స్ నుండి వెండితెరపైకి వెలిసిన మరో తెలుగు అందం. చెన్నై బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఈ టాలీవుడ్ హీరోయిన్. లివింగ్ టుగెదర్ పొట్టి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ నటి.. గాడ్స్ ఆఫ్ ది ధర్మపురి అనే ఓటీటీ మూవీలో నటించింది. ఆ తర్వాత తిరువీర్ మూవీ ’సిన్ (Sin)’చిత్రంలో నటించింది. అల్లు అర్జున్ పుష్పలో అల్లుఅర్జున్ మేనకోడలిగా నటించింది. కానీ ఆమెకు తెలుగులో గుర్తింపు వచ్చింది పరేషాన్ సినిమాతోనే.

రానా దగ్గుబాటి సమర్పణలో వచ్చిన ఈ మూవీలో తిరువీర్ హీరో. పావని హీరోయిన్. చాలా అమాయకత్వంగా కనిపిస్తోంది ఈ జంట. ఆమె మోడ్రన్ లవ్ హైదరాబాద్‌లో కూడా యాక్ట్ చేసింది ఈ బ్యూటీ. అలాగే నాని నిర్మాణ సంస్థలో వచ్చిన హిట్-2 మూవీలో నటించింది. ఇందులో అడవి శేష్ హీరో. పావని ఇందులో శ్రద్ధ అనే క్యారెక్టర్ చేసింది. ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్‌లో వర్క్ చేసేది ఈ నటినే. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం పైలం పిలగా అనే మూవీ చేస్తుంది. ఆనంద్ గుర్రం దర్శకుడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఇటీవల విడుదల చేశారు. త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. అంతేకాకుండా పుష్ప 2లో కూడా నటించబోతుంది అమ్మడు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş