iDreamPost
android-app
ios-app

అక్షయ తృతీయ నాడు రూ. 15 లక్షల జ్యువెల్లరీని తల్లికి గిఫ్టుగా ఇచ్చిన రైతు బిడ్డ

  • Published May 10, 2024 | 4:33 PM Updated Updated May 10, 2024 | 4:33 PM

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి సుపరిచితమే. ఓ సాధారణ రైతు బిడ్డ .. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి.. టైటిల్ విన్నర్ అయ్యాడు. ప్రైజ్ మనీ కింద కొంత డబ్బులు రాగా, ప్రతి రూపాయి రైతుకు ఇస్తానని చెప్పాడు

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి సుపరిచితమే. ఓ సాధారణ రైతు బిడ్డ .. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి.. టైటిల్ విన్నర్ అయ్యాడు. ప్రైజ్ మనీ కింద కొంత డబ్బులు రాగా, ప్రతి రూపాయి రైతుకు ఇస్తానని చెప్పాడు

  • Published May 10, 2024 | 4:33 PMUpdated May 10, 2024 | 4:33 PM
అక్షయ తృతీయ నాడు రూ. 15 లక్షల జ్యువెల్లరీని తల్లికి గిఫ్టుగా ఇచ్చిన రైతు బిడ్డ

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోగా ఎంటర్ టైన్ చేస్తోన్న ప్రోగ్రామ్ బిగ్ బాస్. ఇప్పటి వరకు ఏడు సీజన్లు ముగిశాయి. అయితే ఏ సీజన్‌కు రాని హైప్, విమర్శలు బిగ్ బాస్ సీజన్ 7కు వచ్చాయి. రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్.. ఆ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇంట్లో తన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్న ప్రశాంత్.. బయటకు వచ్చాక చేసిన పనికి విమర్శలపాలు అయ్యాడు. పోలీసులు వద్దని చెప్పి వారించిన.. ర్యాలీ చేయడంతో అతడి ఫ్యాన్స్ రెచ్చిపోయాడు. దీని కారణంగా బస్సులపై రాళ్లు రువ్వి ప్రజాధనాన్నినష్టం చేకూర్చారు.  కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రశాంత్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించగా… బెయిల్ పై విడుదలయ్యాడు. ఇప్పుడు సినిమాలతో బిజీగా మారాడు.

కాగా, బిగ్ బాస్ 7 విన్నర్ కాగా, ప్రైజ్ మనీ కింద రూ. 50 లక్షలు రావాల్సి ఉండగా.. ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షల సూట్ కేసును సొంతం చేసుకోవడంతో కేవలం ప్రశాంత్‌కు రూ. 35 లక్షలు దక్కాయి. వీటిల్లో కొంత డబ్బు ట్యాక్సుల రూపంలో పోతుంది. సుమారు రూ. 20 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లగ్జరీ కారు కూడా గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. హౌస్‌లో ఉన్నప్పుడు రూ. 15 లక్షల విలువైన జ్యువెలరీ కూడా ఇస్తామని ప్రకటించారు. కానీ ఇంత వరకు అందించలేదు. ఐదు నెలలు కావస్తున్నా ఆ ఆభరణాలు ఇవ్వలేదు. తాజాగా వాటిని అందించింది బిగ్ బాస్ యూనిట్. ఈ సందర్భంగా ఆ ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్.

అక్షయ తృతీయ ముందు రోజే జ్యువెలరీ చేతికి రావడంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాడు ఈ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్. ‘అమ్మకు తొలి కానుక. బిగ్ బాస్ ఏడో సీజన్ కు థాంక్స్. లవ్ యూ నాగ్ సర్’ అంటూ ఇన్ స్టాలో పోస్టు చేశాడు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ ప్రైజ్ మనీలో ప్రతి రూపాయి.. రైతులకు పంచుతానని బిగ్ బాస్ సాక్షిగా మాట ఇచ్చాడు ప్రశాంత్. అయితే ఆడబ్బులు పంచకపోవడంతో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రశాంత్ స్పందిస్తూ.. ‘ప్రాణం పోయిన ఇచ్చిన మాట మరువను. నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరం అయినా వెళ్తా.. నిరుపేద రైతు కుటుంబాల కోసం బిగ్ బాస్ ప్రైజ్ మనీతో త్వరలో మీ ముందుకు వస్తున్నా.. జై జవాన్ జై కిసాన్‘ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş