iDreamPost
android-app
ios-app

ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరో తెలుసా? ఆ లిస్ట్ వచ్చేసింది

  • Published Aug 23, 2024 | 1:13 PM Updated Updated Aug 23, 2024 | 1:13 PM

India Top 10 Popular Actors List: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆర్మెక్స్ తాజాగా ఇండియాలోని టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో అత్యధికంగా తెలుగు హీరోస్ ఉండటమే గమన్హారం.

India Top 10 Popular Actors List: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆర్మెక్స్ తాజాగా ఇండియాలోని టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో అత్యధికంగా తెలుగు హీరోస్ ఉండటమే గమన్హారం.

  • Published Aug 23, 2024 | 1:13 PMUpdated Aug 23, 2024 | 1:13 PM
ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరో తెలుసా? ఆ లిస్ట్ వచ్చేసింది

ప్రస్తుతం టాలీవుడ్ దగ్గర నుంచి బాలీవుడ్, కోలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీలోనైనా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా చాలామంది హీరోలు ఇప్పుడు ఈ తరహా సినిమాలు చేయడంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే.. భాషతో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకోవాలని మన హీరోల అభిప్రాయం. ఇక అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ప్రతిఒక్కరూ భారీ బడ్జేట్ లతో సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే ఈ వరుసలో మన టాలీవుడ్ హీరోలు కాస్త ముందు వరుసలో ఉన్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే.. తాజాగా భారత్ లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న టాప్ 10 హీరోలు జాబితాను జులైలో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆర్మెక్స్ మీడియా విడుదల చేసింది. అయితే ఈ లిస్ట్ లో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరోలు తెలుగు వాళ్లు ఉండటమే గమన్హారం.

తాజాగా ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 హీరోల జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ORMAX విడుదల చేసింది. అయితే ఈ లిస్ట్ లో ఐదుగురు తెలుగు హీరోలు ఉండటమే గమన్హారం. పైగా ఈ  ఐదుగురు హీరోలు కూడా పాన్ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, ఇంతకీ ఆ మోస్ట్ పాపులర్స్ హీరోల్లో ముందు వరుసలో ఉన్నవారు మరెవరో కాదు.. పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’. ఈ హీరో ఇటీవలే ‘కల్కి’ మూవీతో భారీ హిట్ అందుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా రికార్డులను సృష్టించాడు. అంతేకాకుండా.. దేశమంతాట ఈ హీరో గురించే మాట్లాడుకుంది. దీంతో ప్రస్తుతం ఆర్మెక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో టాప్ 1 స్థాయిలో ప్రభాస్ నిలిచారు.

అయితే ఈ హీరో తర్వాత స్థానంలో కోలీవుడ్ హీరో విజయ్ ఉన్నారు. ఆ తర్వాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ ఉన్నారు. కానీ, ఈ టాప్ 10 లిస్ట్ లో 5గురు తెలుగు హీరోలు ఉండటంతో.. మరోసారి తెలుగు సినిమా చరిత్రను దేశామంతటా గుర్తించేలా.. గర్వించదగ్గ స్థాయిలో నిలిచింది. మరీ, ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆర్మెక్స్ మీడియా విడుదల చేసిన టాప్ 10 జాబితాలో తెలుగు హీరోలు ఉండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.