iDreamPost
android-app
ios-app

నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని.. ఓంకార్ ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?

  • Author ajaykrishna Published - 10:49 AM, Tue - 19 September 23
  • Author ajaykrishna Published - 10:49 AM, Tue - 19 September 23
నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని.. ఓంకార్ ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?

ఓంకార్.. ఈ పేరు వినగానే పాపులర్ టీవీ షోస్ గుర్తొస్తాయి. టీవీ హోస్ట్ గా కెరీర్ ఆరంభించి.. సినిమా డైరెక్టర్ గా మారాడు. ఓంకార్ అంటే.. ఆట, డాన్స్ ప్లస్, సిక్స్త్ సెన్స్ లాంటి సూపర్ హిట్ షోస్ తో పాటు.. జీనియస్, రాజుగారి గది, రాజుగారి గది 2, రాజుగారి గది 3 సినిమాలు కూడా మైండ్ లోకి వచ్చేస్తాయి. అయితే 2019లో రాజుగారి గది 3 తర్వాత ఓంకార్ నుండి ఏ సినిమా రాలేదు. దర్శకుడిగా మారి దాదాపు పదేళ్లలో నాలుగు సినిమాలే చేశాడు. కానీ.. టీవీ షోస్, ఓటిటి షోల ద్వారా ఎల్లప్పుడూ ప్రేక్షకులతో టచ్ లోనే ఉంటున్నాడు. దాదాపు నాలుగేళ్లుగా టీవీ షోలతో అలరిస్తున్న ఓంకార్.. ఇప్పుడు మరోసారి సినీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.

ఓంకార్ గ్యాప్ తీసుకున్నా.. ఓ యూనిక్ కాన్సెప్ట్ తో వస్తాడని అందరు ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే.. ఎక్కువ టీవీ షోస్ అయినా.. సినిమాలైనా థ్రిల్లర్ జానర్ లోనే చేస్తూ వచ్చాడు. ఈసారి కూడా తనకు క్రేజ్ తెచ్చిన హారర్ థ్రిల్లర్ జానర్ లో కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేశాడు. కానీ.. ఈసారి థియేటర్స్ లో కాకుండా ఓటిటిలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. వినాయక చవితి సందర్బంగా వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో.. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సిరీస్ కి ‘మాన్షన్ 24’ అనే టైటిల్ తో పోస్టర్ వదిలారు. పోస్టర్ లో వరలక్ష్మి సీరియస్ లుక్ తో పాటు ఓ పాడుబడ్డ మాన్షన్ ని చూపించారు.

పోస్టర్ అయితే ఇంటరెస్టింగ్ గా ఉంది. ఓంకార్ ఈసారి కాన్సెప్ట్ ని పెద్దది చేసి వెబ్ సిరీస్ రూపంలో అందించబోతున్నాడు. అయితే.. నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని ఎక్స్ పెక్ట్ చేయలేదని అంటున్నారు ప్రేక్షకులు. రాజుగారి గది మూవీ సిరీస్ తో థియేటర్స్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఓంకార్.. ఈసారి ఓటిటి వరకు పరిమితం చేస్తున్నాడు. అంటే.. థియేటర్స్ ప్రేక్షకులకు ఓంకార్ నిరాశ పరిచినట్లే అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సిరీస్ లో వరలక్ష్మితో పాటు బిందు మాధవీ, అవికా గోర్, అమర్దీప్, మానస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సిరీస్ ప్రముఖ ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మరి ఎప్పుడు స్ట్రీమింగ్ అనేది తెలియాల్సి ఉంది. ఇక ఓంకార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet