Venkateswarlu
వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన నేను సినిమా రంగాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాను. మంచి ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వదిలితే...
వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన నేను సినిమా రంగాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాను. మంచి ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వదిలితే...
Venkateswarlu
నటించటం చాలా కష్టమని.. వెంకన్న మాత్రం తొలి చిత్రంలోనే.. ఈ వయసులో డ్యాన్స్‌లు, ఫైట్‌లు, రొమాన్స్ ఇలా నవరసాలు పండించేశారని ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ ప్రశంసించారు. నటన కష్టం కాబట్టే.. తాను చాలా సినిమాలు నిర్మించినా.. ఏదో రెండు సినిమాల్లో చిన్న క్యారెక్టర్‌లు చేశానని.. ఫుల్‌ప్లెడ్జ్‌గా నటించలేదని చెప్పారు. ‘ఒక్కడే నెం.1’సినిమా ప్రేక్షకులను అకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. సోమవారం ‘ఒక్కడే నెం.1’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సీ కల్యాణ్‌తో పాటు దామోదర ప్రసాద్, అంబికా కృష్ణ, తుమ్మలపల్లి సత్యనారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీవిశ్వనాథ్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ : వెంకన్న పారిశ్రామికవేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమా రంగంపై దృష్టిపెట్టి సమాజానికి ఉపయోగపడేలా ఓ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం అభినందనీయం.
అంబిక కృష్ణ మాట్లాడుతూ : వెంకన్న పారిశ్రామికవేత్తగానే కాదు, హీరోగా కూడా సక్సెస్ అయ్యారని ఈ సినిమా పాటలు, ఫైట్‌లు చూస్తుంటే అర్ధమౌతోంది. ఈ సినిమా తర్వాత మరో సినిమా కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఆయన్ని అభినందించాలి.
కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ : సినిమా ట్రైలర్, పాటలు చూస్తే ఇది ఎంత ప్యాషనేట్‌గా తీశారో అర్ధమౌతోంది. ఇంత మంచి ఔట్‌పుట్ రావాలంటే ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరూ ఇది మన స్వంత సినిమా అనుకుని పనిచేయాలి.
రేలంగి నరసింహారావు మాట్లాడుతూ : యూనిట్ సమష్టిగా కృషి చేశారు. అది తెరమీద కనిపిస్తోంది. ఇది చిన్న సినిమా కాదు.. చిన్న సినిమాలా అనిపించే పెద్ద సినిమా.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ : సినిమా ఫీల్డ్‌లో సక్సెస్‌ల శాతం చాలా తక్కువ. కాబట్టి ఈ ఫీల్డ్‌లోకి వద్దులేండి అన్నాను. దానికి ఆయన ఆ తక్కువలో కొందరు ఉన్నారు కదా.. వారిలో నేను ఎందుకు ఉండకూడదు అని ఎదురు ప్రశ్నించారు.
చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ : వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన నేను సినిమా రంగాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాను. మంచి ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వదిలితే తప్పకుండా సక్సెస్ అవుతుంది అనేది బిజినెస్ సక్సెస్ సీక్రెట్.
కాగా, క్లాసిక్ సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. సునీత, శృతిక, మధువని కథానాయికలుగా నటించారు. శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.