iDreamPost
android-app
ios-app

సాహసం చేస్తున్న ఎన్టీఆర్ బావమరిది.. ఏకంగా స్టార్ హీరోలతో పోటీ

  • Published Aug 12, 2024 | 12:50 PM Updated Updated Aug 12, 2024 | 12:50 PM

AAY Movie : సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ఉన్నా లేకున్నా.. కథను బట్టి ఆయా సినిమాలు టాక్ డిపెండ్ అయ్యి ఉంటుందన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఈ వారం థియేటర్ లో పెద్ద సినిమాల మధ్యన .. ఈ చిన్న సినిమాను రిలీజ్ చేస్తున్నారంటే సాహసమని చెప్పి తీరాల్సిందే.

AAY Movie : సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ఉన్నా లేకున్నా.. కథను బట్టి ఆయా సినిమాలు టాక్ డిపెండ్ అయ్యి ఉంటుందన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఈ వారం థియేటర్ లో పెద్ద సినిమాల మధ్యన .. ఈ చిన్న సినిమాను రిలీజ్ చేస్తున్నారంటే సాహసమని చెప్పి తీరాల్సిందే.

  • Published Aug 12, 2024 | 12:50 PMUpdated Aug 12, 2024 | 12:50 PM
సాహసం చేస్తున్న ఎన్టీఆర్ బావమరిది.. ఏకంగా స్టార్ హీరోలతో పోటీ

చిన్న సినిమాలను ఎంత పెద్ద నిర్మాణ సంస్థలు రూపొందించినా సరే.. ఆయా సినిమాలు రిలీజ్ కు సరైన సమయాన్ని ఎంచుకుంటాయి. ఆ సమయంలో ఎటువంటి పెద్ద హీరోలు సినిమాలు లేకుంటే.. ఈ చిన్న సినిమాలలో కంటెంట్ ఉంటే కనుక.. ఇక దానిని కొట్టే సినిమా మరొకటి ఉండదు. ఎటువంటి పబ్లిసిటీ లేకుండానే.. మౌత్ టాక్ తోనే సినిమా హిట్ అయిపోతుంది. ఇప్పటివరకు అలా చాలానే సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే అదే చిన్న సినిమాలు బడా హీరోల సినిమాలతో పాటు రిలీజ్ చేయడమంటే సాహసమనే చెప్పాలి. ఇప్పుడు ఎన్టీఆర్ బావమరిది ‘ఆయ్’ సినిమాతో చేస్తున్న సాహసం ఇదే. అసలు విషయానికొస్తే..

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె .. మ్యాడ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ఇప్పుడు.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాస్ నిర్మించని ‘ఆయ్’ సినిమాతో.. ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిపోతున్నాడు. ఆగష్టు 15న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇక అదే రోజు రవి తేజ మిస్టర్ బచ్చన్ , అలాగే రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ ,తమిళ డబ్బింగ్ తంగలాన్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే ఈ మూడు సినిమాల గురించి సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఏర్పడింది. ఎంత పెద్ద బ్యానర్ పై సినిమాను రిలీజ్ చేస్తున్నా కానీ.. బజ్ లేకుండా హిట్ కొట్టడం కష్టమే. ఒకవేళ కథ బావుంటే కనుక ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా చేస్తున్నట్లయితే.. మేకర్స్ కు కథపై ఉన్న నమ్మకమే.. ‘ఆయ్’ సినిమాను ఈ టైమ్ లో రిలీజ్ చేసేలా చేసిందేమో అనిపిస్తుంది. ఓ రకంగా స్టార్ హీరోలకు పోటీగా వస్తూ .. ఎన్టీఆర్ బావమరిది.. సాహసం చేస్తున్నాడని చెప్పాల్సిందే.

Aaay Movie

అందులోనూ ఇండిపెండెన్స్ డే , లాంగ్ వీకెండ్ రావడంతో.. సినిమాలన్నీ కూడా ఒకే రోజు రిలీజ్ ప్లాన్ చేశారు. మరి ఈ పెద్ద సినిమాల మధ్యన.. ఆయ్ ఎలా నెగ్గుగు వస్తుందో వేచి చూడాల్సిందే. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉండడంతో.. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో.. అలరించే ప్రేమ కథలతో.. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా కమిటీ కుర్రాళ్ళు మూవీ ఇంచుమించు ఇదే తరహాలో ప్రేక్షకులను బాగానే మెప్పించింది. కాబట్టి ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యే అవకాశలు లేకపోలేదు. ఇక ‘ఆయ్’ రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetup girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş