iDreamPost
android-app
ios-app

కాంతార-2లో నటించడంపై స్పందించిన NTR.. ఏమన్నారంటే?

  • Published Sep 01, 2024 | 5:45 PM Updated Updated Sep 01, 2024 | 6:04 PM

NTR Reaction About acting in Kantara 2 Movie: తాజాగా తారక్ కర్ణాటక వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రిషబ్ శెట్టి ప్రశాంత్ నీల్ తో కలిసి కొన్ని దేవాలయాలను కూడా సందర్శించారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా తారక్ కాంతారా 2 విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

NTR Reaction About acting in Kantara 2 Movie: తాజాగా తారక్ కర్ణాటక వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రిషబ్ శెట్టి ప్రశాంత్ నీల్ తో కలిసి కొన్ని దేవాలయాలను కూడా సందర్శించారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా తారక్ కాంతారా 2 విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

  • Published Sep 01, 2024 | 5:45 PMUpdated Sep 01, 2024 | 6:04 PM
కాంతార-2లో నటించడంపై స్పందించిన NTR.. ఏమన్నారంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో తారక్ ఫ్యామిలీతో కలిసి కర్ణాటక వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి కొన్ని దేవాలయాలను కూడా సందర్శించారు. దీనిలో భాగంగా… ఆయన కొల్లూరులోని మూకాంబిక అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా సోషల్ మీడియాలో నిన్నటినుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తారక్ మీడియా వారితో కూడా సంభాషించారు. అప్పుడే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కాంతారా 2 కు సంబంధించి ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయంపై క్లారిటీ ఇచ్చేసారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

మీడియాతో మాట్లాడుతూ తారక్ ఇలా చెప్పుకొచ్చారు. “రిషబ్ శెట్టితో కలిసి పలు దేవాలయాలు సందర్శించడం ఆనందంగా ఉంది .. ఆలయంలో సినిమా అప్ డేట్స్ పై స్పందించాలని లేదు.. దానికి వేరే కార్యక్రమాలు ఉంటాయి.” అంటూ స్పందించారు. అయితే ‘కాంతార ప్రీక్వెల్ లో మీరు యాక్ట్ చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజమెంత” అని ప్రశ్నించగా.. “రిషబ్ శెట్టినే దానిని ప్లాన్ చేయాలి.. ఆయన ప్లాన్ చేస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ సమాధానం ఇచ్చారు. దీనితో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయినట్లే అని భావిస్తున్నారు అభినానులు. దీనిపై త్వరలోనే ఏదైనా అఫీషియల్ అనౌన్సుమెంట్ చేస్తారేమో చూడాలి మరి.

స్వయంగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతార సినిమా 2022 లో చిన్న సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లో రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. రూ.16 కోట్లతో సినిమా రూపొందించగా.. థియేట్రికల్ రన్ పూర్తయ్యే సమయానికి రూ.450 కోట్లు సంపాదించిందని అంచనా. ఈ సినిమాలో ఉత్తమ నటుడిగా రిషబ్ కు జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి సినిమాకు ప్రీక్వెల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం కాంతార: చాప్టర్ 1 షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమాపై తారక్ స్పందించిన విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş