iDreamPost
android-app
ios-app

Devara Movie: దేవర ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్! తారక్ కామెంట్స్ వైరల్!

  • Published Sep 10, 2024 | 9:46 PM Updated Updated Sep 10, 2024 | 9:46 PM

NTR Comments On Devara Trailer: మంగళవారం సాయంత్రం 5 గంటలకు ‘దేవర’ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ విజువల్ వండర్ అనే చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీనిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక కామెంట్స్ చేశారు.

NTR Comments On Devara Trailer: మంగళవారం సాయంత్రం 5 గంటలకు ‘దేవర’ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ విజువల్ వండర్ అనే చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీనిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక కామెంట్స్ చేశారు.

  • Published Sep 10, 2024 | 9:46 PMUpdated Sep 10, 2024 | 9:46 PM
Devara Movie: దేవర ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్! తారక్ కామెంట్స్ వైరల్!

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ యన్టీఆర్, క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ కాంబేనేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర. సెప్టెంబర్ 27న వర్డల్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దేవర సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. పోస్టర్స్, గ్లిమ్ప్స్, సాంగ్స్.. ఇలా ప్రతి అప్డేట్ కూడా అభిమానులను మెప్పించాయి. ఇటీవల వచ్చిన రెండు సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ పాటలు యూట్యూబ్ లో ఇంకా  మిలియన్ వ్యూస్ రాబడుతున్నాయి.  ఈ క్రమంలో తాజాగా మంగళవారం ‘దేవర’ ట్రైలర్ కూడా వచ్చేసింది. ట్రైలర్ విజువల్ వండర్ అనే చెప్పాలి.

దేవర ట్రైలర్ ను గమనిస్తే…పూర్తి యాక్షన్స్ సన్నీవేశాలతో నిండిపోయిందని చెప్పి తీరాలి. రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్.. సినిమా మీద హైప్ ను అమాంతం పెంచేశాయి. ‘మనిషికి బ్రతికేంత దైర్యం చాలు.. చంపేంత దైర్యం కాదు ‘ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పి తీరాలి. అలానే జాన్వీ కపూర్..తారక్ పై వేసే సెటైర్లు కూడా అందరిని ఆకట్టుకున్నాయి.  సముద్రంలో ఫైటింగ్ సీన్లు, సొరచేప పై నుంచి తారక్ రావడం వంటి అనేక వండర్ పుల్ సీన్లు దేవర ట్రైలర్ లో కనిపించాయి. మొత్తానికి కంప్లీట్ యాక్షన్, లవ్ , డ్రామా సీన్స్ తో వస్తున్న ఈ మూవీ.. తారక్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రస్తుతం దేవర ట్రైలర్ చూసి.. ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ ట్రైలర్ కి  అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్ ను దేవర సంపాదించింది. ఇక ట్రైలర్ ఇచ్చిన కిక్కుతో సినిమా కోసం తారక్ అభిమానులతో పాటు  సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. దేవర ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంపై ఎన్టీఆర్ స్పందించారు. “దేవర ట్రైలర్  పై వచ్చిన ఈ అనుహ్య స్పందనకు చాలా సంతోష పడుతున్నాను. సెప్టెంబర్ 27న కలుద్దాం. నాపైన, దేవరపైన మీరు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు” అంటూ తారక్ చెప్పుకొచ్చాడు.  ఇది ఇలా ఉంటే.. దేవర రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. మేకర్స్ ఓ రేంజ్ లో.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 27న థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ ఆడియన్స్ తో.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అన్ని కాసుల వర్షం తో నిండిపోడానికి రెడీగా ఉన్నాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇదే సమయంలో దేవర ట్రైలర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మొత్తంగా దేవర ట్రైలర్ రెస్పాన్స్ పై తారక్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş