iDreamPost
android-app
ios-app

లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. రాజ్ తరుణ్‌కు పోలీసుల నోటీసు!

  • Published Jul 16, 2024 | 11:00 AM Updated Updated Jul 16, 2024 | 11:00 AM

Notices to Raj Tarun: తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని పదేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు ఓ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడని హీరో రాజ్ తరుణ్ పై ఆయన మాజీ ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం టాలీవుడ్ లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది.

Notices to Raj Tarun: తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని పదేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు ఓ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడని హీరో రాజ్ తరుణ్ పై ఆయన మాజీ ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం టాలీవుడ్ లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది.

  • Published Jul 16, 2024 | 11:00 AMUpdated Jul 16, 2024 | 11:00 AM
లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. రాజ్ తరుణ్‌కు పోలీసుల నోటీసు!

గత కొన్నిరోజులగా తెలుగు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రేయసి లావణ్య, నటి మాల్వీ మల్హోత్రకు సంబంధించిన వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. రాజ్ తరుణ్ తనని దారుణంగా మోసం చేసి హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న లావణ్య ఆరోపణలు ఎలా ఉన్నా.. కొన్నిరోజులుగా రాజ్ తరుణ్ పేరు మాత్రం వార్తల్లో వైరల్ అవుతూనే ఉంది. దీనికి తోడు ఈ మధ్యనే లావణ్య ఆత్మహత్యా యత్నం చేయడం, సమయానికి నార్సింగ్ పోలీసులు అక్కడి వెళ్లి ఆ ప్రయత్నాన్ని విరమింప చేయడంతో బతికి పోయింది. ఈ ఘటనతో లావణ్యపై జనాలకు మరింత సింపతీ పెరిగిపోయింది. తాజాగా రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

పది రోజులుగా తెలగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజ్ తరుణ్ – లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ప్రతిరోజూ ఈ కేసు కొత్త మలుపు తిరుగుతుంది. దీంతో సినీ అభిమానులు ఈ విషయంపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. పదేళ్ల క్రితం రాజ్ తరుణ్ తో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నామని. ఇంతకాలం తనతో సంతోషంగా ఉన్న రాజ్ తరుణ్ ఈ మధ్య మాల్వీ మల్హోత్ర అనే నటితో ఎఫైర్ కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు రాజ్ తరుణ్ తో ఉన్న ఆధారాలు (వీడియోలు, ఫోటోలు) పోలీసులకు సమర్పించింది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాల విషయంపై రాజ్ తరుణ్ విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటిసులో తెలిపారు. జులై 18 లోపు పోలీసులు ఎదుట హాజరు కావాలని నోటీసులు అందజేశారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో ఆయనకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజ్ తరుణ్.. నటి మాల్వీ మల్హోత్ర స్వగ్రామం హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో ఉంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నప్పటికీ జులై 18 లో తప్పని సరిగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabet