iDreamPost
android-app
ios-app

ప్రణీత్ హనుమంతుపై హైపర్ ఆది సెటైర్స్! గట్టిగా ఇచ్చి పడేశాడు!

  • Published Jul 23, 2024 | 3:01 PM Updated Updated Jul 23, 2024 | 3:01 PM

Hyper Aadi Satires On Phanumanthu: ప్రణీత్ హనుమంతు అలియాస్ ఫనుమంతు వివాదంపై హైపర్ ఆది స్పందించారు. ప్రణీత్ హనుమంతు చేసే డార్క్ కామెడీకి, మీరు చేసే కామెడీకి తేడా ఏంటి అన్న ప్రశ్నకు హైపర్ ఆది సమాధానమిచ్చారు.

Hyper Aadi Satires On Phanumanthu: ప్రణీత్ హనుమంతు అలియాస్ ఫనుమంతు వివాదంపై హైపర్ ఆది స్పందించారు. ప్రణీత్ హనుమంతు చేసే డార్క్ కామెడీకి, మీరు చేసే కామెడీకి తేడా ఏంటి అన్న ప్రశ్నకు హైపర్ ఆది సమాధానమిచ్చారు.

  • Published Jul 23, 2024 | 3:01 PMUpdated Jul 23, 2024 | 3:01 PM
ప్రణీత్ హనుమంతుపై హైపర్ ఆది సెటైర్స్! గట్టిగా ఇచ్చి పడేశాడు!

ప్రణీత్ హనుమంతు, అతని ఫ్రెండ్స్ డార్క్ కామెడీతో చేసిన కామెంట్స్ ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికీ తెలిసిందే. తండ్రీ, కూతుర్ల మీద నీచమైన కామెంట్స్ చేస్తూ అందరి ఆగ్రహానికి గురయ్యారు. నిజానికి అంతకు ముందు కూడా నీచమైన కామెంట్స్ చేస్తూ శునకానందం పొందుతూ వచ్చారు. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా దూషిస్తూ వచ్చారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే తండ్రీ, కూతురు వీడియో మీద నీచమైన కామెంట్స్ చేశారో అప్పుడే సాయిధరమ్ తేజ్, మంచు మనోజ్, విష్ణు సహా పలువురు సెలబ్రిటీలు వీరిని గట్టిగా పట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రణీత్ హనుమంతు వివాదంతో కామెడీ షోస్ లో కమెడియన్స్ చేసే కామెడీపై కూడా చర్చ జరుగుతుంది. డబుల్ మీనింగ్ జోక్స్, వల్గర్ కామెంట్స్.. ముఖ్యంగా హైపర్ ఆది వేసే పంచుల గురించే చర్చించుకుంటున్నారు. హైపర్ ఆది చేసేది కూడా డార్క్ కామెడీ కిందకే వస్తుంది కదా.. ఆయన చేసేది ఏంటి అంటూ ఆ మధ్య నెటిజన్స్ పెద్ద ఎత్తున ప్రశ్నించారు. తాజాగా ఈ ఇష్యూపై హైపర్ ఆది స్పందించారు. అశ్విన్ బాబు నటించిన శివం భజే సినిమా ఆగస్టు 1న విడుదలవుతున్న సందర్భంగా ఈ మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అశ్విన్ బాబు, హైపర్ ఆది పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రణీత్ హనుమంతు ఇష్యూపై హైపర్ ఆది స్పందించారు. డార్క్ కామెడీకి, హెల్దీ కామెడీకి చాలా వ్యత్యాసం ఉంటుంది అనేలా హైపర్ ఆది కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్ లో భాగంగా ఇడ్రీమ్ మీడియా నుంచి హైపర్ ఆదికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఈ మధ్య కాలంలో డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. అది పెద్ద ఇష్యూ కూడా అయ్యింది. ఇక బుల్లితెర విషయానికొస్తే టాప్ స్టార్ కమెడియన్స్ లో మీరు ఒకరిగా ఉన్నారు? మరి డార్క్ కామెడీని, హెల్దీ కామెడీని ఎలా వేరుగా చూస్తారు? రెండిటికీ తేడా ఏంటి? అన్న ప్రశ్న ఎదురైంది. దానికి హైపర్ ఆది సమాధానమిస్తూ ప్రణీత్ హనుమంతుపై సెటైర్ వేశారు. డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు.. మేము అది చేయం కాబట్టి బయట ఉన్నాం అంటూ ప్రణీత్ హనుమంతుపై సెటైర్ వేశారు. దీంతో హెల్దీ కామెడీకి, డార్క్ కామెడీకి ఉన్న తేడాను ప్రేక్షకులకు చెప్పినట్లు అయ్యింది. ఇక అశ్విన్ బాబు నటించిన శివం భజే సినిమా ట్రైలర్ ఇవాళే విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఓ లెవల్ లో ఉంటుందన్న విషయం అర్ధమవుతుంది. మరోసారి అశ్విన్ సరికొత్త కథాంశంతో మన ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. మరి ప్రణీత్ హనుమంతుపై హైపర్ ఆది సెటైర్ వేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet