iDreamPost
android-app
ios-app

డాక్టర్ బాబుని హీరో చేసిన ‘కుమారి శ్రీమతి’! హిట్ అయితే అంతే..

  • Author ajaykrishna Updated - 09:54 AM, Sat - 23 September 23
  • Author ajaykrishna Updated - 09:54 AM, Sat - 23 September 23
డాక్టర్ బాబుని హీరో చేసిన ‘కుమారి శ్రీమతి’! హిట్ అయితే అంతే..

సీరియల్స్ లో పాపులర్ అయిన నటులు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా కనిపించడం ఎక్కువగా చూస్తుంటాం. అదే సీరియల్ ఆర్టిస్ట్ లు.. సినిమాలో హీరో, హీరోయిన్స్ గా కనిపిస్తే చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది కదా! ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ హీరో డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల.. సినిమా హీరో అయిపోయాడు. అదికూడా ఏకంగా స్టార్ హీరోయిన్ సరసన.. వింటుంటేనే మామూలుగా లేదు కదా! కానీ ఇది నిజం. డాక్టర్ బాబు హీరోగా మహానటి, సీతారామం ఫేమ్ స్వప్న సినిమాస్ నిర్మాతలు కొత్తగా ఓ సినిమా నిర్మించారు. అది నేరుగా ఓటిటి రిలీజ్ కాబోతుంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు.

అసలు విషయంలోకి వెళ్తే.. నిరుపమ్ ప్రస్తుతం సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేస్తూనే, మరోవైపు పలు సీరియల్స్ నిర్మాణంలో భాగస్వామిగా రాణిస్తున్నాడు. కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబుగా ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఆ సీరియల్ తో వంటలక్క కూడా చాలా ఫేమస్ అయిపోయింది. అయితే.. సీరియల్స్ చేస్తూనే ఓవైపు అప్పుడప్పుడు సినిమాలలో చిన్న చిన్న రోల్స్ లో మెరుస్తున్నాడు నిరుపమ్. అలాంటి నిరుపమ్ కెరీర్ లో ఒక్కసారిగా హీరో అవకాశం వచ్చిపడింది. అదే ‘కుమారి శ్రీమతి’. స్టార్ హీరోయిన్ నిత్యమీనన్ టైటిల్ రోల్ పోషించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.

ఇక ఈ సిరీస్ కు సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో నిత్య శ్రీమతి పాత్రలో ఉండగా.. నిత్యకు బావ క్యారెక్టర్ లో కనిపించాడు డాక్టర్ బాబు. నిత్యతో పాటు నిరుపమ్ క్యారెక్టర్ కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉండటంతో ఈ సిరీస్ పై ఆడియన్స్ లో ఇంటరెస్ట్ పెరిగిపోయింది. గతంలోనే నిరుపమ్ హీరోగా చేయాల్సిన సినిమాలు మిస్ అయ్యాయట. లేదంటే ఈపాటికి తాను కూడా ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేసుండేవాడని సమాచారం. కట్ చేస్తే.. ఇన్నాళ్లకు నిరుపమ్ కాస్త స్టార్ హీరోయిన్ పక్కన లీడ్ రోల్ అంటే మామూలు విషయం కాదని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే.. కుమారి శ్రీమతితో నిరుపమ్ కాకుండా మసూద ఫేమ్ తిరువీర్ కూడా ఉన్నాడు. ఇక ఈ సిరీస్ ని గోమతేష్ ఉపాధ్యాయ తెరకెక్కించారు. సెప్టెంబర్ 28 నుండి సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. మరి డాక్టర్ బాబు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişacerbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom