iDreamPost
android-app
ios-app

నిహారిక కష్ట పడింది.. అదృష్టం కలిసొచ్చింది.. కానీ టైమే ఎక్కువ లేదు!

  • Published Aug 12, 2024 | 3:00 PM Updated Updated Aug 12, 2024 | 3:00 PM

Niharika Konidela- Committee Kurrollu Movie Box Office Run: నిహారిక కొణిదెల నిర్మాతగా అద్భుత విజయం అందుకున్నారు. కమిటీ కుర్రాళ్లకు వరల్డ్ వైడ్ గా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ఈ మూవీకి ఇంకా ముడ్రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటం కాస్త కంగారు పెట్టే అంశం.

Niharika Konidela- Committee Kurrollu Movie Box Office Run: నిహారిక కొణిదెల నిర్మాతగా అద్భుత విజయం అందుకున్నారు. కమిటీ కుర్రాళ్లకు వరల్డ్ వైడ్ గా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ఈ మూవీకి ఇంకా ముడ్రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటం కాస్త కంగారు పెట్టే అంశం.

  • Published Aug 12, 2024 | 3:00 PMUpdated Aug 12, 2024 | 3:00 PM
నిహారిక కష్ట పడింది.. అదృష్టం కలిసొచ్చింది.. కానీ టైమే ఎక్కువ లేదు!

కమిటీ కుర్రాళ్లు.. ఒక చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన చిత్రం ఇది. వెండితెరపైకి ప్రొడ్యూసర్ గా నిహారిక తీసుకొచ్చిన తొలి చిత్రం కమిటీ కుర్రాళ్లు. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అటు కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి. తొలిరోజు రూ.1.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ కమిటీ కుర్రాళ్లు చిత్రం.. మూడ్రోజుల్లోనే లాభాల బాట పట్టింది అంటూ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంత మంచి టాక్ సొంతం చేసుకున్న కమిటీ కుర్రాళ్లు చిత్రానికి ఇంకా మూడురోజుల సమయం మాత్రం ఉండటం కాస్త కంగారు పుట్టించే అంశం అనే చెప్పాలి.

కేవలం మూడ్రోజుల్లోనే కమిటీ కుర్రాళ్లు చిత్రం వరల్డ్ వైడ్ గా 6.04 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డే 1కంటే డే2కి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. డే 2 కంటే డే3లో ఇంకా ఆ లెక్క పెరిగింది. మూవీ ఇంతటి ఘన విజయం సాధించడంలో ముందుగా మెగా డాటర్ నిహారికను ప్రశంసించి తీరాల్సిందే. 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేయడం అంటే చిన్న విషయం కాదు. టాలీవుడ్ లో నిర్మాతగా తన తొలి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తొలి ప్రయత్నంలోనే నిహారిక అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఒక కథను నమ్మడం.. అంతే నమ్మకంగా తెరకెక్కించడం.. అంతకు మించిన ప్రశంసలు, కలెక్షన్స్ రాబట్టడం సాధారణ విషయం కాదు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఎంతో పెద్ద హిట్టు కొట్టేశారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. ఆగస్టు 15 నుంచి ఇలాంటి పరిస్థితే ఉంటే బాగుటుంది.

సినిమా పరంగా కమిటీ కుర్రాళ్లకు తెలుగు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకో మూడ్రోజుల వరకు ఈ మూవీనే తెలుగు ప్రేక్షకులకు టాప్ ప్రయారిటీ కూడా. నిజానికి ఒక సినిమాకి మంచి లాభాలు రావడానికి కనీసం 10 రోజులు సమయం కావాలి. లేదంటే లీస్ట్ కేస్ లో కనీసం వారం రోజులు ఉండాలి. కానీ, కమిటీ కుర్రాళ్లకు ఆ ఛాన్స్ కూడా లేదు. ఆగస్టు 15 నుంచి లాంగ్ వీకెండ్ కావడంతో.. పెద్ద హీరోల సినిమాలు క్యూ కడుతున్నాయి. రవితేజ నుంచి మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ నుంచి తంగలాన్, జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నె నితిన్ నుంచి ఆయ్ చిత్రాలు రాబోతున్నాయి.

బాలీవుడ్ రైడ్ మూవీకి రీమేక్ గా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే డబుల్ ఇస్మార్ట్ తో పూరి మాస్ ట్రీట్ రెడీ చేశాడు. ఇంక విక్రమ్ తంగలాన్, ఆయ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఇన్ని చిత్రాల రిలీజులు ఉన్న నేపథ్యంలో కమిటీ కుర్రాళ్లకు కాస్త ప్రియారిటీ తగ్గుతుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ, కలెక్షన్స్ చూస్తే మాత్రం తెలుగు సినిమా ప్రేక్షకులు కమిటీ కుర్రాళ్లను బాగా ఆదరిస్తున్నారు అనే విషయం అర్థమవుతోంది. పెద్ద హీరోలు సినిమాలు వచ్చినా కూడా ఆ ఆదరణ అలాగే ఉండాలని.. కమిటీ కుర్రాళ్లు చిత్రం ఇంకా మంచి కలెక్ష్స్ రాబట్టాలని కోరుకుందాం.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabetEscortes Belgique