iDreamPost
android-app
ios-app

పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నా పారితోషికం తీసుకోని ప్రభాస్!

  • Published May 15, 2024 | 9:31 PM Updated Updated May 15, 2024 | 9:31 PM

వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ ప్రభాస్ ది. ఒక మామూలు సినిమా చేస్తేనే వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు హీరోలు. ఇక పాన్ ఇండియా సినిమా అంటే అది డబుల్, త్రిబుల్ అవుతుంది. అలాంటిది ప్రభాస్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నా గానీ ఆ మూవీకి అసలు పారితోషికం లేదట.

వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ ప్రభాస్ ది. ఒక మామూలు సినిమా చేస్తేనే వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు హీరోలు. ఇక పాన్ ఇండియా సినిమా అంటే అది డబుల్, త్రిబుల్ అవుతుంది. అలాంటిది ప్రభాస్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నా గానీ ఆ మూవీకి అసలు పారితోషికం లేదట.

  • Published May 15, 2024 | 9:31 PMUpdated May 15, 2024 | 9:31 PM
పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నా పారితోషికం తీసుకోని ప్రభాస్!

సినిమా హీరోలు తమకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని భారీగా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంటారు. ఇప్పుడున్న హీరోల రేంజ్ ప్రపంచ స్థాయికి ఎదిగింది. పాన్ ఇండియా సినిమాలతో వాళ్ళ మార్కెట్ విపరీతంగా పెరిగిపోవడంతో వందల కోట్లలో పారితోషికాలు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాలకి ఏ రేంజ్ లో మార్కెట్ ఉంటుందో తెలిసిందే. దానికి తగ్గట్టే పారితోషికం కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది పాన్ ఇండియా సినిమా కోసం ప్రభాస్ అసలు పారితోషికమే తీసుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత సలార్ 2కి సిద్ధమవ్వనున్నారు.

ఇక పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న కల్కి చిత్రం జూన్ 27న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. పాన్ ఇండియా సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ఈ సినిమాకి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా చిత్ర యూనిట్ ఇచ్చింది. ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు అంటూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారంటూ మొదట్లో ప్రచారం జరిగింది. కానీ పరశురాముడి పాత్రలో నటిస్తారని తాజాగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు ప్రభాస్ అసలు పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. మంచు కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా.. ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఈ సినిమా చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి టీజర్ ను ఈ నెల 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదల చేయనున్నారు. మరి కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ పారితోషికం తీసుకోకుండా సినిమా చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.     

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet