iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా.. ఆ లిస్ట్ లో చేరనుందా?

  • Author ajaykrishna Updated - 08:50 AM, Wed - 11 October 23
  • Author ajaykrishna Updated - 08:50 AM, Wed - 11 October 23
రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా.. ఆ లిస్ట్ లో చేరనుందా?

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు స్టార్ హీరోల సినిమాల విషయంలో ట్రెండ్ మారుతోంది. ఇదివరకు హీరోలు బట్టి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆదరణ పొందేవి. కొన్నాళ్ళుగా ట్రెండ్ లో మార్పు వచ్చి.. కంటెంట్ పరంగా సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. కంటెంట్ పరంగా అనేది చిన్న, పెద్ద అన్ని సినిమాల విషయంలో ముఖ్యం అయిపోయింది. అది వేరే విషయం. కానీ.. ఇప్పుడు ఒకే కంటెంట్ ని పార్ట్స్ గా చెప్పడం కొత్త ట్రెండ్ అయ్యింది. బాహుబలి, కేజీఎఫ్, బ్రహ్మాస్త్రం.. ఇలా సీక్వెల్స్ కాకుండా ఒకే కథను భాగాలుగా విడదీసి చెప్పే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సలార్ కూడా అదే రేసులో ఉంది. ఇప్పుడదే బాటలో రామ్ చరణ్ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర కూడా రెండు భాగాలుగా ప్రకటించారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. కట్ చేస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కూడా అదే ప్లానింగ్ జరుగుతుందని టాక్ నడుస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ హీరోగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలుసు కదా.. RC16 పేరుతో ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే.. దర్శకుడు బుచ్చిబాబు ప్రెజెంట్ స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమాతో బిజీ అయ్యాడు.

ఇక తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ – బుచ్చిబాబుల సినిమా కొత్త ట్రెండ్ లో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఒకే కథను రెండు భాగాలుగా చెప్పి సక్సెస్ అయ్యాయి బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు. ఇప్పుడు వాటి మార్గంలో దేవర.. ఇంకా కొత్తగా RC16 ట్రెండ్ లో చేరుతుందని టాక్. ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడంలో కూడా లాభాలు ఉన్నాయి. కంటెంట్ సాలిడ్ గా ఉంటే.. ఖచ్చితంగా ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనే విషయం ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. సో.. ఇప్పుడు బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ సినిమాని రెండు భాగాలుగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడని కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. బట్.. నిజమే అయితే చరణ్ ఫ్యాన్స్ హ్యాపీనే. కాగా.. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరి RC16 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.