iDreamPost
android-app
ios-app

దేవరకు కొత్త టెన్షన్! అదే జరిగితే భారీ ఓపెనింగ్స్ కు గండి!

  • Published Sep 17, 2024 | 4:15 PM Updated Updated Sep 17, 2024 | 4:15 PM

New tension for Devara Movie : కొన్ని రోజుల క్రితం వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయ్యారు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుమణుగుతుంది అనే టైమ్ కి మళ్ళీ.. తుఫాన్ హెచ్చరికలు వస్తున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్ దేవర మూవీపై పడనుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

New tension for Devara Movie : కొన్ని రోజుల క్రితం వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయ్యారు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుమణుగుతుంది అనే టైమ్ కి మళ్ళీ.. తుఫాన్ హెచ్చరికలు వస్తున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్ దేవర మూవీపై పడనుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 17, 2024 | 4:15 PMUpdated Sep 17, 2024 | 4:15 PM
దేవరకు కొత్త టెన్షన్! అదే జరిగితే భారీ ఓపెనింగ్స్ కు గండి!

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తారక్ నటించిన దేవర సినిమా.. రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటితోనే సగం సినిమా హిట్ కొట్టేసింది. ఇంకా తెరపై కథ చూడడం మాత్రమే బ్యాలన్స్. దీనితో మూవీ రిలీజ్ డేట్ కోసం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక ఎలాగూ రిలీజ్ కు కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. మూవీ ప్రమోషన్స్ లో టీమ్ అంతా బిజీగా ఉన్నారు. ఏర్పాట్లన్నీ బాగానే సాగుతున్నాయని.. అనుకునే టైమ్ కి ఇప్పుడు దేవర సినిమాకు కొత్త టెన్షన్ మొదలైంది. తాజాగా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ ఎఫెక్ట్ దేవరపై పడనుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కొన్ని రోజుల క్రితం వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయ్యారు. ఇళ్ళు, రోడ్లు , బస్సు స్టాప్ లో, రైల్వే స్టేషన్స్ లు ఇలా అన్ని జలయం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రజలంతా కనీస వసతులకు కూడా దూరమయ్యారు. ఈ విషయంపై వెంటనే స్పందించి.. తెలుగు హీరోలంతా వారికే అండగా నిలిచి.. భారీ మొత్తంలో విరాళాలు అందించారు. దానికి సంబంధించిన వార్తలను కూడా చూశాము. ఇక ఇప్పుడిప్పుడే అంతా సర్దుమణుగుతుంది అనుకునే సమయానికి.. తాజాగా మరోసారి తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ‘సెప్టెంబర్ 26-28 మధ్యలో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం/తుఫాన్ వల్ల భారీ వర్షాలకు అవకాశం. ఏ జిల్లాలు ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యేది మరో వారం రోజుల్లో తెలుస్తుంది’ అంటూ ఓ న్యూస్ వచ్చింది. దీనితో తారక్ అభిమానులంతా కంగారు పడుతున్నారు.

సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వేగంగానే కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో మరోసారి భారీ వర్షాలు… అది కూడా సరిగ్గా 26-28 మధ్యలో అంటే.. కచ్చితంగా ఆ ఎఫెక్ట్ దేవర మూవీ కలెక్షన్స్ పై పడే అవకాశం లేకపోలేదు. ఓ మోస్తరు వర్షం పడితే కనుక అభిమానులు దానిని ఎలాగూ లెక్కచేయరు. కానీ మునుపటిలా అతి భారీ వర్షాలు, తుఫాను అయితే మాత్రం.. మొదటి రోజు వసూళ్లకు గండి పడినట్లే. అయితే, వరుణ దేవుడు కరుణించి దేవరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తే కనుక.. అనుకున్నట్లుగానే అంతా కొనసాగుతుంది. ఇక ఏమవుంతుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş