యానిమల్ మూవీతో.. సందీప్ వంగా రిస్క్ తీసుకుంటున్నాడా?

అర్జున్ రెడ్డి సినిమాతో దేశవ్యాప్తంగా సందీప్ వంగా ప్రకంపనలు సృష్టించాడు. నిర్మించిన అన్ని భాషల్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రణ్ బీర్ కపూర్- రష్మికాతో కలిసి యానిమల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో దేశవ్యాప్తంగా సందీప్ వంగా ప్రకంపనలు సృష్టించాడు. నిర్మించిన అన్ని భాషల్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రణ్ బీర్ కపూర్- రష్మికాతో కలిసి యానిమల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సందీప్ వంగా.. తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఒక డైరెక్టర్ కి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారా? అనే ప్రశ్నకు ఈ జనరేషన్ లో సందీప్ వంగాను సమాధానంగా చూపించవచ్చు. అర్జున్ రెడ్డి చిత్రంతో విమర్శకులను సైతం మెప్పించి.. తెరకెక్కిన ప్రతి  భాషలో ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు సందీప్ వంగా.. రణ్ బీర్ కపూర్- రష్మిక కాంబోలో యానిమల్ చిత్రం తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ పై సందీప్ వంగా దాడి చేసేందుకు రెడీ అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీపై కొత్త చర్చ మొదలైంది.

యానిమల్ చిత్రంపై పాన్ ఇండియా లెవల్లో బజ్ గట్టిగానే నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, రెండు సింగిల్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. పాటలు మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. యానిమల్ టీజర్ చూసిన తర్వాత అందరి మదిలో మెదిలిన మాట ఒకటే.. అర్జున్ రెడ్డి కంటే ఈ సినిమా హైఓల్టేజ్ తో ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే సందీప్ వంగా ఈ సినిమా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి సమయంలో ఈ సినిమాపై కొత్త చర్చ ఒకటి జరుగుతోంది. ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు ఉంటుదని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై ఫ్యాన్స్ నెట్టింట స్పందిస్తున్నారు. అంత రన్ టైమ్ అయితే ఇబ్బంది అవుతుందేమో అనే సందేహాలను లేవనెత్తుతున్నారు. ఇంకొందరు కాస్త టైమ్ తగ్గిస్తే బెటర్ కదా అంటూ సూచిస్తున్నారు. మరికొంత మంది రెండు భాగాలుగా తెరకెక్కించండి అంటూ సలహాలిస్తున్నారు. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించిం లేదు. అదే రన్ టైమ్ ఫైనల్ అవుతుంది అని కూడా చెప్పడానికి లేదు. సందీప్ వంగా రిస్క్ తీసుకుంటున్నాడేమో అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే రన్ టైమ్ నిజంగానే 3 గంటలకు పైగా ఉంటుందని చెప్పలేం.

ఒకవేళ అంత టైమ్ ఉన్నా కూడా సందీప్ వంగా కరెక్ట్ గా తెరకెక్కిస్తే ఆ రన్ టైమ్ అనేది పెద్ద సమస్య కాదనే చెప్పాలి. అర్జున్ రెడ్డితో తనలో ఉన్న స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఏంటో ప్రేక్షకులకు చూపించాడు. కాబట్టి నిజంగా అంత రన్ టైమ్ పెట్టాల్సి వచ్చినా కూడా కచ్చితంగా ఎంగేజింగ్ గానే ఉండేలా సందీప్ జాగ్రత్త పడతాడు అనే చెప్పాలి. ఇంక స్క్రీన్ మీద రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక ఉంటే ప్రేక్షకులు సీటు నుంచి కదలాలి అనుకోరు. కాబట్టి నెట్టింట జరుగుతున్న ఈ చర్చ కేవలం రూమర్స్ అయి ఉండవచ్చు. ఒకవేళ నిజమైనా కూడా సందీప్ దానికి తగినట్లు ప్లాన్ చేసుకునే ఉంటాడని సినిమా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నరు. మరి.. యానిమల్ సినిమా నిడివి ఎక్కువగా ఉండచ్చు అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments