iDreamPost
android-app
ios-app

ప్రతిసారి ఏడుస్తూ ఇంటికొచ్చేదాన్ని.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన రష్మిక!

  • Published Aug 12, 2024 | 9:11 PM Updated Updated Aug 12, 2024 | 9:11 PM

Rashmika Mandanna Reveals Her Audition Experience: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా రంగంలో తనకు ఎదురైన అనుభవాలు మాత్రమే కాకుండా.. జరిగిన అవమానాల గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది.

Rashmika Mandanna Reveals Her Audition Experience: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా రంగంలో తనకు ఎదురైన అనుభవాలు మాత్రమే కాకుండా.. జరిగిన అవమానాల గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది.

  • Published Aug 12, 2024 | 9:11 PMUpdated Aug 12, 2024 | 9:11 PM
ప్రతిసారి ఏడుస్తూ ఇంటికొచ్చేదాన్ని.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన రష్మిక!

రష్మికా మందన్న అలియాస్ నేషనల్ క్రష్. కొందరు ప్రేమగా క్రష్మికా అని కూడా పిలుచుకుంటారు. రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన ఈ అమ్మడు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు పుష్పా 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే ఇవన్నీ ఇప్పటి విషయాలు మాత్రమే. కానీ, తాను కెరీర్ లో ఎన్ని కష్టాలు పడింది. ఎన్ని అవమానాలు ఎదుర్కున్నది తాజాగా రష్మికా మందన్న వెల్లడించింది. తాను ప్రతిరోజు ఏడుస్తూ ఇంటికి వచ్చేదాన్ని అంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

సినిమా రంగానికి రంగుల ప్రపంచం అని మరో పేరు ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ సక్సెస్ గుర్రం మీద స్వారీ చేసే వరకు ఎవరికైనా పేరు, ప్రాధాన్యత ఉంటుంది అని ఓపెన్ గానే చెబుతూ ఉంటారు. ఫ్యాన్స్ లో ఆదరణ, చేతినిండా సినిమాలు ఉన్న ఆర్టిస్టుల గురించే ఎవరైనా మాట్లాడుకుంటారు. వాళ్లు ఏం మాట్లాడినా వింటారు. అయితే హీరో అయినా.. హీరోయిన్ అయినా.. కెరీర్ తొలినాళ్లలో అంత తేలిగ్గా అవకాశాలు దక్కవు. అందుకోసం వాళ్లు రోజూ యుద్ధం చేయాల్సిందే. ఇప్పుడు మెగాస్టార్ గా కీర్తించబడుతున్న చిరంజీవికి కూడా అంత తేలిగ్గా అవకాశాలు రాలేదు అని ఆయనే స్వయంగా చెబుతుంటారు. అలాగే రష్మికకు కూడా అంత ఈజీగా ఈ స్టార్ హీరోయిన్ హోదా, సినిమా అవకాశాలు రాలేదు అనే విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆడిషన్స్ సమయంలో తాను ఎదుర్కొన్ని కొన్ని దారుణమైన సంఘనలు, సందర్భాల గురించి తన ఫ్యాన్స్ కి వివరించింది.

తాను తరచూ ఆడిషన్స్ కి వెళ్లేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఆడిషన్స్ కొందరైతే ముఖం మీదే అసలు నీది నటనకు పనికొచ్చే ముఖమేనా అని అవమానించారు అంటూ రష్మిక వెల్లడించింది. తనకు ఎదురైన అనుభవనా గురించి చెప్తూ.. “నేను ఆడిషన్స్ కి వెళ్లిన ప్రతిసారి ఎడుస్తూనే ఇంటికి తిరిగొచ్చేదాన్ని. ఒకసారి ఒక మూవీ కోసం నన్ను పదే పదే ఆడిషన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్ కోసం 3 నెలలు వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేశారు. కానీ, తర్వాత కొన్ని రోజులకే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత కూడా నేను దాదాపు 25 ఆడిషన్స్ లో రిజెక్ట్ అయ్యాను. నా కెరీర్లో ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నాను.

నా యాక్టింగ్ స్కిల్స్ పై వాళ్లకి ఎప్పుడూ అనుమానం ఉండేది. కానీ, నేను మాత్రం నా కెరీర్లో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తగ్గాలి అని కూడా అనుకోలేదు. నేను చేసిన ప్రతి సినిమా, ప్రతి పాత్రకు నన్ను నేను మెరుగు పరుచుకుంటూ వచ్చాను. నేను చేసిన సినిమాలను ఎప్పుడు చూసినా ఇంకాస్త బెటర్ గా చేస్తే బాగుండేది కదా అనుకుంటాను” అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఇంక పుష్ప 2 కాకుండా రష్మిక చేతిలో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. శేఖర్ కమ్ముల- నాగార్జున- ధనుష్ చేస్తున్న కుబేర మూవీలో రష్మిక చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో సికిందర్, విక్కీ కౌశల్ సరసన చవ్వా చిత్రాల్లో కూడా రష్మికా మందన్న చేస్తోంది. ఇవి కాకుండానే మరిన్ని భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటున్నారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet