68 ఏళ్ల వయస్సులో 7వ తరగతి పరీక్షలు రాసిన ప్రముఖ నటుడు..

చదువుకు వయస్సుకు అడ్డంకి కాదని నిరూపించాడు 2018 మూవీ నటుడు. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నటుడు.. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్నాడు. తాజాగా 7వ తరగతి పరీక్షలకు హాజరై..

చదువుకు వయస్సుకు అడ్డంకి కాదని నిరూపించాడు 2018 మూవీ నటుడు. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నటుడు.. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్నాడు. తాజాగా 7వ తరగతి పరీక్షలకు హాజరై..

కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన మూవీ 2018. టోవినో థామస్, కుంచికో బోబన్, ఆసిఫ్ అలీ, సునీల్ కుమార్, వినీత్ శ్రీనివాసన్, లాల్ వంటి స్టార్స్ ఉన్నారు. వీరితో పాటు మరో కీ రోల్‌లో నటించాడు ఇంద్రన్స్. ఈయన్ను కాపాడే ప్రయత్నంలోనే టోవినో థామస్ మరణిస్తాడు. ఈ పాత్రతో పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఇంద్రన్స్. ఇప్పుడు ఏడవ తరగతి పరీక్షలు రాసి మరోసారి వార్తల్లో నిలిచాడు. చదువుకు వయస్సు అడ్డంకి కాదని నిరూపిస్తూ.. 68 ఏళ్ల వయస్సులో పరీక్షలకు హాజరయ్యారు. కేరళలోని అట్టకులంగర స్కూల్లో విద్యార్థులతో కలిసి ఎగ్జామ్స్ రాశారు. అందరి విద్యార్థుల్లాగా ఈయన కూడా పరీక్షలంటే భయమట. ఎట్టకేలకు రాసి వచ్చాడు ఈ స్టూడెంట్. నాలుగో తరగతిలోనే పరిస్థితుల వల్ల చదువు మానేసిన ఇంద్రన్స్.. జీవనోపాధి కోసం టైలరింగ్ నేర్చుకున్నాడు.

ఆ తర్వాత అతని అడుగులు ఇండస్ట్రీ వైపు పడ్డాయి. అయితే అతనికి చదువుకోవాలన్న కల.. కలగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు చదువుకోవాలన్న ఆలోచన పుట్టి.. పుస్తకాలు తీశారు. డైరెక్టుగా పది చదవడానికి కేరళలో అనుమతి లేదు. దీనికి ఏడవ తరగతి పాస్ కావాలి. అందుకే ఏడో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు ఈ నటుడు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.30 గంటలకు మూడు సెషన్లలో పరీక్షలు రాయనున్నారు. ఈరోజు మలయాళం, ఇంగ్లీష్, హిందీ పరీక్షలకు హాజరయ్యారు. రేపు సోషల్ సైన్స్, సైన్స్, గణితం పరీక్షలు జరగనున్నాయి. మరో రెండు వారాల్లో ఈ పరీక్షల ఫలితాలను ఇవ్వనున్నారు. దీని తర్వాత ఆయన పదోతరగతి పరీక్షలకు ప్రిపేర్ కానున్నారు.

ఇంద్రన్స్ 10వ తరగతికి రాగానే కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా అతడిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే అతడి పేరును ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు అక్షరాస్యత మిషన్ సిద్ధమవుతుంది. ఇంద్రన్‌కు చదువుపై ఉన్న ఎనలేని అభిరుచి అంబాసిడర్‌గా సామాన్యులకు స్ఫూర్తినిస్తుంది కాబట్టే అతడిని అంబాసిడర్‌గా చేస్తున్నట్టు డైరెక్టర్ ఏజీ ఒలీనా తెలిపారు. ఆయన కెరీర్ విషయానికి వస్తే.. ఆయన అసలు పేరు కె సురేంద్రన్. కాస్ట్యూమ్ డిజైనర్‌గా మొదలైన ఆయన ప్రయాణం నటుడిగానూ కొనసాగింది. 1985 నుండి ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు చేశారు. 2018 సినిమాలో అంధుడి పాత్రలో నటించాడు. ఈ మూవీలో తన పాత్రకు ఉత్తమ నటుడిగా కేరళ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.  కేవలం మలయాళమే కాదు కొన్ని తమిళ చిత్రాల్లోనూ మెరిశాడు.  బుల్లితెరపై కూడా సందడి చేశాడు.

Show comments