Keerthi
ఇటీవలే నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో విడుదలైన రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమాను విభన్నంగా తెరెకెక్కించారు దర్శకుడు జైదీప్ విష్ణు. అయితే తాజాగా ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందండి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..
ఇటీవలే నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో విడుదలైన రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమాను విభన్నంగా తెరెకెక్కించారు దర్శకుడు జైదీప్ విష్ణు. అయితే తాజాగా ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందండి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..
Keerthi
ఈ మధ్యకాలంలో చిన్న తరహా సినిమాలు ఏవైనా కంటెంట్ బాగుంటే ప్రేక్షుకులు కచ్చితంగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇండస్ట్రీలో కొత్త దర్శకులతో పాటు కొత్త నటి, నటులు కూడా పరిచయం అవుతున్నారు. అయితే.. గతేడాది విడుదలైన అయిన ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ సిసిమాతో కూడా కొంతమంది నటీ,నటులు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాను నక్సలిజం కథాంశంతో దర్శకుడు జైదీప్ విష్ణు తెరకెక్కించారు. ఇప్పటికే ఈ నక్సలీజం బాక్ గ్రౌండ్ తో విరాటపర్వం, సిందూరం వంటి సినిమాలు తెరకెక్కించగా .. ఇప్పుడు రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం అనేది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇంతకు ముందు తీసిన సినిమాలతో పోలిస్తే రెబల్ ఆఫ్ తుపాకులగూడెం సినిమా కాన్సెఫ్ట్ కాస్తా భిన్నంగానే ఉంటుంది. ఇక ఈ సినిమా గతేడాది ఫ్రిబవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చ మిశ్రమ టాక్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందండి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..
నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ సినిమాను కొత్తగా.. రెగ్యులర్ కథలకు దూరంగా ఉండేలా తెరకెక్కించారు దర్శకుడు విష్ణు. ఈ సినిమాలో కామెడీతో పాటు మంచి సందేశాన్ని కూడా ఉండేలా రూపొందించారు. అయితే ఈ సినిమా విడుదలై ఏడాది కావోస్తుండగా.. ఇప్పుడు ఓటీటీలో సందండి చేయడానికి రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమాను ఫ్రిబవరి 8 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు. చాలా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ అయిన ఈ సినిమాలో ప్రవీణ్ కంటెల , శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి వినీత్ కుమార్ తదితర నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇక కథ విషయానికి వస్తే.. యథార్థ ఘటనల ఆధారంగా ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కాగా, ఈ సినిమా అంతా విలే జ్ బ్యాక్ డ్రాప్ చుట్టూ సాగుతుంది. అలాగే నక్సలిజం సమస్యను రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకు వస్తారు.ఇందులో ఎవరైన నక్సలైట్లు లొంగిపోతే వారికి మూడు లక్షల రూపాయలతో పాటు పోలీస్ జాబ్ ఇస్తామని ప్రకటిస్తుంది. దీంతో తన ప్రేమ కోసం ఆశపడిన వినీత్ కుమార్ నక్సలైట్‌గా వేషం మార్చి పోలీసులకు లొంగిపోయే ప్రయత్నం చేస్తాడు? కానీ, శివన్న అనే నక్సలైట్ లీడర్ వల్ల అతడి ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది? ఈ క్రమంలోనే.. శివన్న ఏం చేశాడు? మమతతో కుమార్ ప్రేమాయణం సక్సెస్ అయ్యిందా? అసలు నక్సలైట్లతో గొడవ పడిన క్రాంతి ఎవరు? అలాగే 18 ఏళ్ల క్రితం మాయమైన అతడు ఎక్కడికి వెళ్లిపోయాడు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే..రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమా చూడాల్సిందే. మరి, త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అవుతున్న అ రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా పై మీ అభిప్రాయాలనే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.