iDreamPost
android-app
ios-app

డిప్రెషన్ లో నాకు తోడుగా నిలిచింది అదేనంటూ నవీన్ ఆసక్తికర కామెంట్స్

  • Published Aug 21, 2024 | 12:19 PM Updated Updated Aug 21, 2024 | 12:19 PM

Naveen Polishetty Opens Up About Depression : ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోలలో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నవీన్ చేతి కట్టుతో కామెడి వీడియోస్ చేస్తూ కనిపిస్తున్నారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి వచ్చిన ఆయన.. తన హెల్త్ కు సంబంధించి ఎదురైన కొన్ని ప్రశ్నలపై ఈ విధంగా స్పందించారు.

Naveen Polishetty Opens Up About Depression : ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోలలో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నవీన్ చేతి కట్టుతో కామెడి వీడియోస్ చేస్తూ కనిపిస్తున్నారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి వచ్చిన ఆయన.. తన హెల్త్ కు సంబంధించి ఎదురైన కొన్ని ప్రశ్నలపై ఈ విధంగా స్పందించారు.

  • Published Aug 21, 2024 | 12:19 PMUpdated Aug 21, 2024 | 12:19 PM
డిప్రెషన్ లో నాకు తోడుగా నిలిచింది అదేనంటూ నవీన్ ఆసక్తికర కామెంట్స్

ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమాలలో తమ సత్తా ఏంటో చూపిస్తున్న హీరోలు.. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి టాలెంటెడ్ హీరోలలో ఒకరు నవీన్ పోలిశెట్టి. ఇప్పటివరకు ఈ హీరో తీసిన సినిమాలన్నీ కూడా మంచి హిట్స్ అందుకున్నాయి. ఇక నవీన్ పోలిశెట్టి నుంచి వచ్చిన లాస్ట్ మూవీ.. అనుష్కతో నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఈ మూవీ తర్వాత నవీన్ పోలిశెట్టి మాత్రం.. ఎక్కడా కనిపించలేదు. దీనితో నవీన్ ఏమైపోయాడు అనే సందేహలు అభిమానులలో మొదలయ్యాయి. ఈ క్రమంలో రీసెంట్ గా చేతి కట్టుతో.. సోషల్ మీడియాలో కొన్ని కామెడీ వీడియోస్ చేస్తూ కనిపించాడు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి వచ్చిన ఆయన.. తన హెల్త్ కు సంబంధించి.. ఎదురైనా కొన్ని ప్రశ్నలకు.. ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కు ప్రతి వారం ఎవరో ఒకరు గెస్ట్ గా వస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం నవీన్ పోలిశెట్టి గెస్ట్ గా వచ్చారు. దీనితో నవీన్ ఇన్ని రోజులు ఏమైపోయాడు.. తన చేతికి అయిన గాయం ఏంటి అనే దానిపై నవీన్ కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై నవీన్ స్పందిస్తూ.. అసలు తన చేయి సాధారణ స్థితికి వస్తుందో లేదో అని భాధపడినట్లు చెప్తూ.. “‘గత ఆరు నెలలు చాలా కష్టంగా గడిచాయి. ఎన్నోసవాళ్లు ఎదుర్కొన్నాను. అసలు నా చేతికి అయిన గాయం తగ్గుతుందో లేదోనని ఒకానొక సందర్భంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను . అయితే అలాంటి కష్టకాలంలో నాకు ఓదార్పును ఇచ్చింది మాత్రం సంగీతం అని చెప్తాను. మ్యూజిక్‌ నాకు ఓ థెరపీలా పని చేసింది. ఈ సందర్భంగా మ్యూజిషియన్లకు థాంక్స్ చెప్తున్నాను.” అంటూ చెప్పుకొచ్చారు నవీన్. అలాగే ఈ సంధర్బంగా రాబోయే తన రెండు సినిమాలకు సంబంధించిన అప్ డేట్ ను కూడా ఇచ్చి.. ఓ పాటను కూడా పాడారు.

అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తర్వాత అమెరికా వెళ్లారు నవీన్ పోలిశెట్టి.. ఆ సమయంలో అనుకోకుండా ఓ రోడ్ యాక్సిడెంట్ కు గురయ్యారు. ఈ క్రమంలోనే అతనికి విపరీతమైన గాయాలు అయ్యాయి. దీనితో కొన్ని నెలలుగా నవీన్ సినిమాలకు , సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అభిమానులు ఆందోళన చెందడంతో.. తనకైన గాయాలు కారణంగానే సినిమాలకు దూరంగా ఉన్నానంటూ.. ఓ వీడియో ద్వారా అందరికి తెలియజేశారు. ఇక ఈసారి నవీన్ నుంచి రాబోయే సినిమాలు.. ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాయో వేచి చూడాలి. మరి తన ఆరోగ్యం గురించి నవీన్ శెట్టి స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş