iDreamPost
android-app
ios-app

అమెరికాలో యాక్సిడెంట్ పై నవీన్ పొలిశెట్టి ఫస్ట్ రియాక్షన్!

  • Published Jul 17, 2024 | 2:44 PM Updated Updated Jul 17, 2024 | 2:44 PM

Naveen Polishetty Health Update: నవీన్ పొలిశెట్టి కొన్ని నెలల తర్వాత తొలిసారి ప్రేక్షకులు, తన ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. తన హెల్త్ కి సంబంధించి ఫస్ట్ అప్ డేట్ అయితే ఇచ్చాడు. తాను ప్రమాదానికి గురైన విషయాన్ని వెల్లడించాడు.

Naveen Polishetty Health Update: నవీన్ పొలిశెట్టి కొన్ని నెలల తర్వాత తొలిసారి ప్రేక్షకులు, తన ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. తన హెల్త్ కి సంబంధించి ఫస్ట్ అప్ డేట్ అయితే ఇచ్చాడు. తాను ప్రమాదానికి గురైన విషయాన్ని వెల్లడించాడు.

  • Published Jul 17, 2024 | 2:44 PMUpdated Jul 17, 2024 | 2:44 PM
అమెరికాలో యాక్సిడెంట్ పై నవీన్ పొలిశెట్టి ఫస్ట్ రియాక్షన్!

టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో నవీన్ పొలిశెట్టి కూడా ఒకడు. ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్య భరిత పాత్రలు, విభిన్న కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అటు బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే నవీన్ పొలిశెట్టి గత కొన్నాళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేడు. అసలు ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు. అయితే కొన్ని రోజుల క్రితం నవీన్ పొలిశేట్టికి అమెరికాలో యాక్సిడెంట్ జరిగింది అని వార్తలు వచ్చాయి. అయితే దానికి సంబంధించి ఇప్పుడు నవీన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

ఇది తన లైఫ్ అప్ డేట్ అంటూ నవీన్ పొలిశెట్టి చెప్పుకొచ్చాడు. “ఈరోజు నేను మీతో ఒక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ నా చేతి బోన్ కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాలికి కూడా గాయమైంది. ఇది నాకు టఫ్ మాత్రమే కాదు.. పెయిన్ ఫుల్ సమయం కూడా. ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్ లో. ఈ గాయం వల్ల నేను ఫాస్ట్ గా నా చిత్రాలను మీ ముందుకు తీసుకురాలేకపోతున్నందుకు సారీ. గత కొన్ని రోజులు చాలా టఫ్ గా గడిచాయి. నేను కంప్లీట్ గా రికవర్ అయ్యి.. మీకు నా బెస్ట ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి వైద్యుల సహాయంతో వర్క్ చేస్తున్నాను. కానీ, దానికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టచ్చు.

నేను ముందు కంటే స్ట్రాంగ్ గా, హెల్తీగా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే.. ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా అప్ కమింగ్ ఫిల్మ్ స్క్రిప్ట్స్ అద్భుతంగా, మీకు బాగా నచ్చే విధంగా రూపు దిద్దుకుంటున్నాయి. నేను పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ ప్రారంభిస్తాము. మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంటే నాకు అన్నీ. నేను తిరిగి మీ ముందుకు రావాలన్న ఆశకి అవే మోటివేషన్. మీ సపోర్ట్ కీ, పేషన్స్ కి చాలా థ్యాంక్స్.

అతి త్వరలో నేను మళ్లీ స్క్రీన్ మీద కనిపించి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీరు ఎప్పటిలాగానే నా మీద మీ ప్రేమని కురిపించడానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను. లవ్, మీ జానే జిగర్” అంటూ నవీన్ పొలిశెట్టి తన పోస్ట్ లో ఫ్యాన్స్ కి అసలు విషయం చెప్పుకొచ్చాడు. రెండ్రోజుల క్రితం నవీన్ పొలిశెట్టి గురించి ఒక వార్త వచ్చింది. ఫ్లాపులకు భయపడి నవీన్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు అంటూ ఆ వార్త సారాంశం. అలాంటి వార్తలకు తావివ్వకూడదు అని నవీన్ పొలిశెట్టి ఇన్నాళ్ల తర్వాత తనకు జరిగిన ప్రమాదం గురించి అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు ఉన్నాడు. నవీన్ పొలిశెట్టి ఫ్యాన్స్ ఈ పోస్ట్ చూసి ఎమోషనల్ అవుతున్నారు. నవీన్ స్ట్రాంగ్ గా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Naveen Polishetty (@naveen.polishetty)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet