iDreamPost
android-app
ios-app

‘హాయ్ నాన్న’కి ముందు నుయ్యి వెనుక గొయ్యి..?

  • Author ajaykrishna Updated - 11:57 AM, Tue - 3 October 23
  • Author ajaykrishna Updated - 11:57 AM, Tue - 3 October 23
‘హాయ్ నాన్న’కి ముందు నుయ్యి వెనుక గొయ్యి..?

ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ అనేది చాలా కామన్. ఒక్కోసారి సోలో రిలీజ్ లకంటే.. హోరాహోరిగా థియేటర్స్ లో రిలీజ్ అయితే వాతావరణం చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందని ఫ్యాన్స్ అంటుంటారు. కాకపోతే.. అన్ని సినిమాలు ఆడితే బాగుంటుంది. కానీ.. పరిస్థితులు అలా ఉండవు కదా.. సినిమాలలో కొత్తదనం ఉంటే ఖచ్చితంగా అన్ని సినిమాలను ఆదరిస్తారు ప్రేక్షకులు. కానీ.. పోటీ అనేది ఏయే సినిమాలకు మధ్య ఉందనేది పాయింట్. ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారిన సినిమా ఏదైనా ఉందంటే.. అది డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రెజెంట్ మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉంది.

ఇక సలార్ మూవీ.. సెప్టెంబర్ నుండి వాయిదా పడి డిసెంబర్ కి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్బంగా డిసెంబర్ 22న సలార్ ని వరల్డ్ వైడ్ వివిధ భాషలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. కాగా.. సలార్ రిలీజ్ డేట్ ఇప్పుడు ఇండస్ట్రీని తీవ్రంగా కుదిపేసింది. ముందుగా డిసెంబర్ రిలీజ్ అనుకున్న సినిమాలన్నీ సలార్ తో పోటీకి రాలేక వేరే డేట్స్ కోసం తంటాలు పడుతున్నాయి. ఈ లిస్ట్ లో ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న’ కూడా ఉంది. దసరా మూవీతో మంచి హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు ఈ ఫీల్ గుడ్ మూవీని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. సో.. హాయ్ నాన్న కూడా మేకర్స్ డిసెంబర్ 21న ఫిక్స్ చేశారు.

కట్ చేస్తే.. సలార్ రాకతో ఇప్పుడీ హాయ్ నాన్న డేట్ మారబోతుంది. ఎలాగో సలార్ కి పోటీగా కింగ్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘డుంకి’ రిలీజ్ అవుతోంది. ఈ రెండు బిగ్ క్లాష్ మధ్య నానినే కాదు.. ఎవరు పోటీకి రావడానికి సిద్ధపడరు. సో.. నాని సినిమా ఒక వారం వెనక్కి అంటే.. డిసెంబర్ 15కి వద్దామనుకుంటే.. ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఉంది. సరే.. అదికూడా వద్దు.. డిసెంబర్ 1కి వద్దాం అనుకుంటే.. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల ‘యానిమల్’ రిలీజ్ ఉంది. ఈ సినిమాకు తెలుగులో కూడా సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. సో.. రిస్క్ అవుతుంది. కాబట్టి.. హాయ్ నాన్నకి ఎటు చూసుకున్నా ఒకే వారంలో వసూల్ చేయాల్సి ఉంటుంది. నానికి ముందు చూస్తే.. సలార్ నుయ్యిలాగా.. వెనక్కి వస్తే యానిమల్, కెప్టెన్ మిల్లర్ గొయ్యిలాగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి హాయ్ నాన్న గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet