iDreamPost
android-app
ios-app

సందీప్ కిషన్‌ పక్కన ఉన్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా..?

  • Published Aug 29, 2024 | 1:47 PM Updated Updated Aug 29, 2024 | 1:47 PM

Sundeep Kishan: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్‌ పక్కన ఉన్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా..? ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కొనసాగుతుంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

Sundeep Kishan: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్‌ పక్కన ఉన్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా..? ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కొనసాగుతుంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Aug 29, 2024 | 1:47 PMUpdated Aug 29, 2024 | 1:47 PM
సందీప్ కిషన్‌ పక్కన ఉన్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు సందీప్ కిషన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ చోటా కే నాయుడు, శ్యామ్ కే నాయుడు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సందీప్.. తొలి మూవీలో నెగిటివ్ రోల్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. అమ్మాయిల కలల రాకుమారుడైన ఈ హీరో పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరో తెలుసా..? సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ హీరోయిన్‌ను తలపిస్తున్న ఈ యువతి ఎవరంటే.. సందీప్ కిషన్ సోదరి మౌనిక. ఇటీవల రాఖీ పండుగను పురస్కరించుకుని.. రాఖీ శుభాకాకంక్షలు తెలియజేస్తూ తన సోదరితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశాడు సందీప్ కిషన్. అవి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. ఇందులో ఆసమ్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్నారీ అన్నా చెల్లెళ్లు.

తన చిన్ననాటి ఫోటోతో పాటు.. సోదరితో దిగిన కొన్ని ఫోటోలను నెటిజన్లతో పంచుకున్నాడు. సందీప్ బ్లూ జాకెట్ అండ్ వైట్ షర్ట్‌తో క్రేజీగా ఉంటే.. అన్నకు మించిన అందంతో కట్టిపడేస్తుంది మౌని. అచ్చ తెలుగమ్మాయి అయిన ఆమె.. ఎల్లో శారీలో గార్జియస్‌గా కట్టిపడేస్తుంది. గతంలో కూడా మౌనికతో ఉన్న పిక్స్ పంచుకున్నాడు కానీ.. ఈ అవుట్ ఫిట్స్‌తో మాత్రం అదరగొట్టేస్తున్నారు. ప్రస్తుతం మౌనిక కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతుంది. నిర్మాతగా కొనసాగుతుంది. రానా దగ్గుబాటి హీరోగా వచ్చిన అరణ్య మూవీకి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. అన్న లాగే నిర్మాతగా కొనసాగుతుంది. ఇక సందీప్ కిషన్ కెరీర్ విషయానికి వస్తే.. అసోసియేట్ డైరెక్టర్‌గా గౌతమ్ వాసు దేవ మీనన్ వంటి స్టార్ దర్శకుడి దగ్గర వర్క్ చేశాడు. ప్రస్తానం మూవీలో నెగిటివ్ రోల్ పోషించిన ఈ యంగ్ స్టార్.. స్నేహ గీతం చిత్రంతో హీరోగా మారాడు.

కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. కెరీర్ తొలి నాళ్లలో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టాడు. షోర్ ఇన్ ద సిటీతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తిరిగి తెలుగులోకి రిటర్న్ అయ్యాడు. విభిన్న కథలను ఎంచుకుని దూసుకెళుతున్నాడు. రోటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి వంటి చిత్రాలు చేశాడు. కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో నటించింది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. ఈ మూవీతోనే రకుల్ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయ్యింది. డీ ఫర్ దోపిడీ, రా రా కృష్నయ్య, జోరు, బీరువా, టైగర్, రన్, ఒక్క అమ్మాయి తప్ప చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. శమంతక మణి, నక్షత్రం, మనసుకు నచ్చింది, నెక్ట్ ఏంటీ, తెనాలి రామ కృస్ణ బీఏ బీఎల్, ఎ1 ఎక్స్ ప్రెస్, వివాహ భోజనంబు, గల్లీ రౌడీ వ ంటి చిత్రాలు.. ఈ ఏడాది ఊరి పేరు భైరవ కోనతో హిట్ అందుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా..మరో హీరో చిత్రాల్లోనూ కనిపిస్తున్నాడు. తాజాగా ధనుష్ మూవీ రాయన్‌లో నటించాడు. ఇటు తెలుగు, అటు తమిళంలో సినిమాలు చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Sundeep Kishan (@sundeepkishan)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş