iDreamPost
android-app
ios-app

పోలా.. నాని సరిపోదా శనివారం గ్లింప్స్ అదిరిపోలా

  • Published Feb 24, 2024 | 12:07 PM Updated Updated Feb 24, 2024 | 12:16 PM

నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న మరో మూవీ సరిపోదా శనివారం. నాని పుట్టిన రోజును పురస్కరించుకుని గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ గ్లింప్స్ఎలా ఉందో ఓ లుక్ వేయండి.

నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న మరో మూవీ సరిపోదా శనివారం. నాని పుట్టిన రోజును పురస్కరించుకుని గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ గ్లింప్స్ఎలా ఉందో ఓ లుక్ వేయండి.

  • Published Feb 24, 2024 | 12:07 PMUpdated Feb 24, 2024 | 12:16 PM
పోలా.. నాని సరిపోదా శనివారం గ్లింప్స్ అదిరిపోలా

మన పక్కింటి అబ్బాయిలా కనిపించే హీరో నాని. సహజంగా ఉంటే నాని నటన.. అతడికి నాచురల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చింది. గత ఏడాది రెండు వరుస హిట్లతో జోరు మీదున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీ చేస్తున్నాడు. తనతో అంటే సుందరానికి మూవీని తెరకెక్కించిన దర్శకుడు వివేక్ ఆత్రేయకు మరో ఛాన్స్ ఇచ్చాడు నాని. ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. నటుడు, డైరెక్టర్ ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. సాయి కుమార్, శుభ లేఖ సుధాకర్ ఇతర పాత్రధారులు. కాగా, ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజును పురస్కరించుకుని గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ ఏడాది నాని పుట్టిన రోజు శనివారం రావడం.. సినిమా టైటిల్లో కూడా శనివారం ఉండటం, శనివారమే టీజర్ విడుదల చేయడానికి ఓ మంచి అవకాశం భావించినట్లు ఉంది చిత్ర యూనిట్. నిమిషం ఇరవై సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్..అదిరిపోయింది. ‘ కోపాలు రకరకాలు.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కోలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమ బద్ధంగా పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకును చూశారా.. నేను చూశా’ అంటూ ఎస్‌జే సూర్య డైలాగ్ తో గ్లింప్స్ ప్రారంభమైంది. ‘నా పేరు సూర్య.. రోజు శనివారం’ అంటూ నాని ఇంట్రడక్షన్ చూపించారు. చివరికి సూర్యతో హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ పలకించాడు దర్శకుడు.  ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్  కూడా ఎనౌన్స్ చేశాడు.

ఆగస్టు 29న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. గతంలో అంటే సుందరానికి మూవీలో ఓ చిన్న లైన్ సినిమాను నడిపిస్తుంది. ఆ పోస్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు సరిపోదా శనివారం విషయంలో కూడా అదే ఫాలో అయ్యాడు దర్శకుడు. ఇందులో నాని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దసరా తర్వాత మరోసారి మాస్ ఎలివేషన్లలో కనిపించబోతున్నాడు నాని. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బేజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio