iDreamPost
android-app
ios-app

US బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న నాని! ప్రీ సేల్స్ లో తగ్గేదే లే..

  • Published Aug 26, 2024 | 3:17 PM Updated Updated Aug 26, 2024 | 3:17 PM

Saripodhaa Sanivaaram Movie US pre sales crossed 200k dollars: US బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ దూసుకెళ్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రీ సేల్స్ లో తగ్గేదే లే అంటూ రెచ్చిపోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Saripodhaa Sanivaaram Movie US pre sales crossed 200k dollars: US బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ దూసుకెళ్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రీ సేల్స్ లో తగ్గేదే లే అంటూ రెచ్చిపోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

US బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న నాని! ప్రీ సేల్స్ లో తగ్గేదే లే..

న్యాచురల్ స్టార్ నాని మరికొన్ని రోజుల్లో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ‘సరిపోదా శనివారం’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 29న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది. దాంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఓవర్సిస్ లో ఉన్న తెలుగు ప్రేక్షకులు నాని మూవీ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రీమియర్స్ ప్రీ సేల్స్ బుకింగ్స్ లోనే తెలిసిపోతోంది.

యూఎస్ మార్కెట్ లో టాలీవుడ్ మూవీలకు భారీ క్రేజ్ ఉందన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నాని సినిమాలకు సైతం అక్కడి మార్కెట్ లో మస్త్ డిమాండ్ ఉంది. తాజాగా ఆ విషయం ‘సరిపోదా శనివారం’ బుకింగ్స్ తో మరోసారి రుజువు అయ్యింది. యూఎస్ లో ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో జోరు చూపిస్తున్నాడు నాని. ఇప్పటికే ప్రీమియర్ ప్రీ సేల్స్ లో 200K డాలర్స్ కు పైగా వసూళ్లను  రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సినిమా రిలీజ్ కు ఇంకాస్త టైమ్ ఉండటంతో.. ప్రీ సేల్స్ ఇంకా పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ 28న అక్కడ ప్రీమియర్స్ షోలు పడనున్నాయి.

ఇదిలా ఉండగా.. మరోవైపు తీరికలేని ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు నాని. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాను కింది స్థాయి ఆడియెన్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఈ మూవీలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. విలన్ గా కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్ జే సూర్య నటిస్తున్నాడు. మరి యూఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ.. దూసుకెళ్తున్న న్యాచురల్ స్టార్ నానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.