iDreamPost
android-app
ios-app

Aamir Khan: నా ఓవర్ యాక్టింగ్ వల్లే ఆ మూవీ డిజాస్టర్! ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

  • Published Aug 26, 2024 | 1:59 PM Updated Updated Aug 26, 2024 | 1:59 PM

ఆ సినిమా నా ఓవర్ యాక్టింగ్ కారణంగానే డిజాస్టర్ అయ్యిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ సినిమా నా ఓవర్ యాక్టింగ్ కారణంగానే డిజాస్టర్ అయ్యిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 26, 2024 | 1:59 PMUpdated Aug 26, 2024 | 1:59 PM
Aamir Khan: నా ఓవర్ యాక్టింగ్ వల్లే ఆ మూవీ డిజాస్టర్! ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

చాలా మంది హీరోలు సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దానికి బాధ్యత వహించడానికి ముందుకు రారు. అయితే చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే సినిమా డిజాస్టర్ కు నేనే కారణం అంటూ ధైర్యంగా ఒప్పుకుంటారు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఇలాగే ఒప్పుకున్నాడు. ఆ సినిమాలో నా యాక్టింగ్ బాలేదు.. అందుకే డిజాస్టర్ అయ్యింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమిర్ చెప్పిన ఆ మూవీ ఏది? ఇప్పుడు చూద్దాం.

ఆమిర్ ఖాన్.. బాలీవుడ్ లో విభిన్నమైన స్టోరీస్ ను ఎంచుకునే హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు. ఇక త్రీ ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. అయితే ఈ మిస్టర్ ఫర్ ఫెక్ట్ నటించిన చివరి చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ. 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ.. ఎవ్వరూ ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఫలితంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆమిర్ ఖాన్.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లాల్ సింగ్ చద్దా ఫలితం గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ..”లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ గా నిలవడానికి ప్రధాన కారణం నా యాక్టింగ్. ఈ మూవీలో నా నటన బాలేదు. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే పర్సనల్ గా నాకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం. అయితే ఇందులో నా యాక్టింగ్ ఓవర్ అయినట్లు అనిపించింది. దాంతో  ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ కాలేదు. ఈ ఫ్లాప్ కు పూర్తి బాధ్యత నాదే.  నా నెక్ట్స్ మూవీ ‘సితారా జమీన్ పర్’ అందరికి నచ్చేలా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు మిస్టర్ ఫర్ ఫెక్ట్. కాగా.. సినిమా ఫెయిల్యూర్ కు బాధ్యత నాదే అని ధైర్యంగా ఒప్పుకున్న ఆమిర్ ఖాన్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss