iDreamPost
android-app
ios-app

ఆసక్తికరంగా ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ లుక్.. ఈసారి జానర్ మార్చిన క్రేజీ కాంబో!

  • Author ajaykrishna Updated - 10:21 PM, Mon - 23 October 23

గతేడాది నానితో కలిసి అంటే సుందరానికి మూవీ చేసిన వివేక్.. తదుపరి సినిమా కూడా నానితోనే చేస్తుండటం విశేషం. కాగా.. దసరా ఫెస్టివల్ సందర్బంగా వీరి కాంబినేషన్ లో రానున్న సెకండ్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ తాజాగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఫస్ట్ లుక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతేడాది నానితో కలిసి అంటే సుందరానికి మూవీ చేసిన వివేక్.. తదుపరి సినిమా కూడా నానితోనే చేస్తుండటం విశేషం. కాగా.. దసరా ఫెస్టివల్ సందర్బంగా వీరి కాంబినేషన్ లో రానున్న సెకండ్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ తాజాగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఫస్ట్ లుక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Author ajaykrishna Updated - 10:21 PM, Mon - 23 October 23
ఆసక్తికరంగా ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ లుక్.. ఈసారి జానర్ మార్చిన క్రేజీ కాంబో!

ఇండస్ట్రీలో మరో క్రేజీ మూవీ రెడీ అవుతోంది. అంటే సుందరానికి.. మూవీ తర్వాత వెంటనే రెండోసారి చేతులు కలిపేశారు నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి లాంటి క్లాస్ సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ వివేక్.. ఈసారి కొత్తగా యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నాడు. గతేడాది నానితో కలిసి అంటే సుందరానికి మూవీ చేసిన వివేక్.. తదుపరి సినిమా కూడా నానితోనే చేస్తుండటం విశేషం. కాగా.. దసరా ఫెస్టివల్ సందర్బంగా వీరి కాంబినేషన్ లో రానున్న సెకండ్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ తాజాగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఫస్ట్ లుక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక అనౌన్స్ మెంట్ విషయానికి వస్తే.. నాని – వివేక్ ఆత్రేయ సెకండ్ మూవీకి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. టైటిల్ తో పాటు అనౌన్స్ మెంట్ కూడా ఇంటరెస్టింగ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. దర్శకుడు వివేక్ ఈసారి.. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు సాలిడ్ యాక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు వీడియో గ్లింప్స్ చూస్తే అర్ధమవుతుంది. ఎందుకంటే.. వీడియో అంతా నటుడు సాయికుమార్ వాయిస్ ఓవర్ తో సీరియస్ టోన్ లో సాగింది. ఈ వీడియోలో నాని.. తన చేతులకు ఉన్న సంకెళ్లను విడిపించుకుంటూ రౌద్రంగా కనిపించాడు. ఇందులో నాని క్యారెక్టర్ పేరు సూర్య అని తెలుస్తుంది. ప్రస్తుతం సరిపోదా శనివారం అనౌన్స్ మెంట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా.. నాని సినిమాకు సరిపోదా శనివారం అనే టైటిల్ చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే.. ఈ ఏడాది దసరా మూవీతో మంచి హిట్ అందుకున్న నాని, ప్రెజెంట్ హాయ్ నాన్న అనే టైటిల్ తో మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం అనేది ఎలాంటి సినిమా అనేది ఆసక్తి రేపుతోంది. టైటిల్ అయితే అటు క్లాస్ కి మాస్ కి మధ్యగా ఉంది. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని డీవీవి దానయ్య నిర్మిస్తుండగా.. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జంటగా ప్రియాంక మోహన్ నటించనుంది. నానితో ప్రియాంకకి ఇది రెండో సినిమా. నాని చేసిన గ్యాంగ్ లీడర్ మూవీతోనే ప్రియాంక టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. మరి ఈసారి నాని, ప్రియాంక సరిపోదా శనివారంతో ఏం చేస్తారో చూడాలి. ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet