iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి తమిళ్, తెలుగు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది.. గుర్తు పట్టారా..?

  • Published Mar 21, 2024 | 6:17 PM Updated Updated Mar 21, 2024 | 6:17 PM

అబ్బాయి డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ బ్యూటీ తమిళ, తెలుగు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. ఇప్పటికే పాతికకు పైగా సినిమాల్లో నటించిన ఈ స్టార్ నటి ఎవరో చెప్పగలరా..?

అబ్బాయి డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ బ్యూటీ తమిళ, తెలుగు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. ఇప్పటికే పాతికకు పైగా సినిమాల్లో నటించిన ఈ స్టార్ నటి ఎవరో చెప్పగలరా..?

  • Published Mar 21, 2024 | 6:17 PMUpdated Mar 21, 2024 | 6:17 PM
ఈ చిన్నారి తమిళ్, తెలుగు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది.. గుర్తు పట్టారా..?

ఒకప్పుడు ముంబయి, ఢిల్లీ నుండి భామలను అరువు తెచ్చుకునేది తెలుగు ఇండస్ట్రీ. యాక్టింగ్‌ రాకపోయినా, ఖర్చు ఎక్కువయ్యినా సరే..వారినే తీసుకు వచ్చి పెట్టుకునేవారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు కాస్త టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నార్త్ ఇండియన్ భామలను దిగుమతి చేసుకుంటూనే సౌత్ ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలకు వల వేస్తున్నారు. ఫస్ట్ ప్రియారిటీ కేరళ కుట్టీలకే. తక్కువ రెమ్యనరేషన్ .. మంచి ఫెర్ఫ్మామెన్స్ ఇస్తారు మలబార్ బ్యూటీస్. మలయాళ ఇండస్ట్రీ తర్వాత అరువు తెచ్చుకునే భామలు కన్నడ సీమ నుండే. చందనపు బొమ్మలు దక్షిణాది సినిమాల్లో చేసి.. ఆ తర్వాత హిందీ పరిశ్రమలో హవా సాగిస్తుంటారు. ఐశ్వర్యరాయ్ నుండి నేటి రష్మిక మందన్న వరకు బాలీవుడ్ ను ఏలేస్తుంది శాండిల్ వుడ్ భామలే కదా.

ఇదిగో ఈ ఫోటోలో ఉన్న పాప కూడా కన్నడ కస్తూరీనే. బాబు వేషధారణలో ఉన్న ఈ చిన్నారి.. మలయాళం మినహాయించి సౌత్ సినిమాల్లో హవా సాగిస్తోంది. తమిళం, తెలుగులో పేర్లల్‌ గా సినిమాలు చేస్తూ.. నేను ఆడ ఉంటా.. ఈడ ఉంటానని అంటోంది. ఇప్పటికే 25 సినిమాలకు పైగా చేసేసిన ఈ బ్యూటీ.. గత ఏడాది ఓ థ్రిల్లర్ మూవీతో అలరించింది. అసలు ఆ అమ్మాయి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందే హారర్ మూవీతో. ఇంతకు ఆ శాండిల్ వుడ్ సోయగం ఎవరంటే.. నందితా శ్వేత. ఈ హీరోయిన్ పేరు చెప్పగానే..హారర్ సినిమాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో టీటౌన్ ఇండస్ట్రీలోకి లెగ్ పెట్టిన ఈ భామ.. హిట్ చూసేసింది. ఇందులో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కింద ఫిల్మ్ ఫేర్ అవార్డను గెలుచుకుంది కూడా..

నితిన్ సరసన శ్రీనివాస కళ్యాణం, సత్య దేవ్‌తో బ్లఫ్ మాస్టర్ చిత్రాల్లో నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రేమ కథా చిత్రం, అభినేత్రి 2, అక్షర, ఏడు, కల్కి, కపటదారి, జెట్టీ, హిడింబ, రారా పెనిమిటీ వంటి చిత్రాలు చేసింది. 2008 నుండి కొనసాగుతున్న ఈ భామ ఈ పదిహేను సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతుండటం గమనార్హం. ఇప్పటికే 30కి పైగా సినిమాలు చేసేసింది. గత ఏడాది వచ్చిన మంగళవారం చిత్రంలో మెరిసింది అమ్మడు. ఎస్సై మాయ పాత్రలో మెప్పించింది. 33 ఏళ్ల పడిలోకి వచ్చేసిన ఈ బ్యూటీ గురించి.. ఏ హీరోతో ఎఫైర్స్ ఉన్నట్లు రూమర్స్ లేవు. తాజాగా రణం అనే తమిళ చిత్రం రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఆమె కొన్ని ప్రాజెక్టులను వింటుందని వినికిిడి. సోషల్ మీడియాలో ఆమె హల్ చల్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టా వన్ మిలియన్స్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet