iDreamPost
android-app
ios-app

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మూవీ లాంఛ్ ముహూర్తం ఇదేనా!

  • Published Aug 31, 2024 | 12:24 PM Updated Updated Aug 31, 2024 | 12:24 PM

Nandamuri Mokshagna Debut Movie Update: నందమూరి బాలకృష్ణ తనయుడు.. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Nandamuri Mokshagna Debut Movie Update: నందమూరి బాలకృష్ణ తనయుడు.. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 31, 2024 | 12:24 PMUpdated Aug 31, 2024 | 12:24 PM
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మూవీ లాంఛ్ ముహూర్తం ఇదేనా!

ఇండస్ట్రీలో హీరోల వారసత్వం ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు యంగ్ జెనెరేషన్ ఎంట్రీ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుంచో బాలకృష్ణ మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటివరకు సరైన కథ దొరకకపోవడంతో .. మోక్షజ్ఞ ఎంట్రీ కాస్త లేట్ అయింది. ఇక ఇటీవల ఈ విషయం గురించి అనౌన్స్ చేసిన దగ్గరనుంచి.. ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ప్లాన్ చేసినట్లు.. ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అలాగే త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు కూడా సమాచారం. ఇక ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ఏంటంటే ఈ మూవీని స్టార్ట్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టాక్. వినాయక చవితి ముందు రోజు.. సెప్టెంబర్ 6న రామకృష్ణ స్టూడియోస్ లో.. ఈ సినిమా స్టార్ట్ చేసెనేదుకు ముహూర్తం ఫిక్స్ చేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్. అంతే కాకుండా ఈ లాంచింగ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది. ఈ ఈవెంట్ కు సంబంధించి మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ ఏంటి.. ఎలా ఉండబోతుంది.. అని అందరికి ఇప్పటినుంచే క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ఇక మూవీ లాంచ్ తో పాటు.. అసలు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కథ ఏంటి ఎలా ఉండబోతుంది.. ఇలా సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ న్యూస్ తో అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అది కాకుండా బాలకృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న.. ఇదే ఏడాదిలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక ఈ కొత్త హీరో ఆ లెజెండరీ లెగసిని కంటిన్యూ చేస్తాడా .. ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobetjojobet girişJojobet Casino Sitesicasibomjojobetmarsbahis