iDreamPost
android-app
ios-app

బాలయ్యని గట్టిగా వాడేస్తున్న అల్లు ఫ్యామిలీ! ఇప్పుడు మరో గుడ్ న్యూస్!

  • Published Jul 22, 2024 | 3:28 PM Updated Updated Jul 22, 2024 | 3:28 PM

Balakrishna Reference in Allu Sirish Buddy Movie: నందమూరి నట సింహం బాలకృష్ణను గట్టిగా వాడేస్తోంది అల్లు ఫ్యామిలీ. ఇక ఇప్పుడు అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. ఇది ఇటు అల్లు ఫ్యాన్స్ తో పాటుగా బాలయ్య అభిమానులను కూడా తెగ సంతోష పెడుతోంది.

Balakrishna Reference in Allu Sirish Buddy Movie: నందమూరి నట సింహం బాలకృష్ణను గట్టిగా వాడేస్తోంది అల్లు ఫ్యామిలీ. ఇక ఇప్పుడు అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. ఇది ఇటు అల్లు ఫ్యాన్స్ తో పాటుగా బాలయ్య అభిమానులను కూడా తెగ సంతోష పెడుతోంది.

  • Published Jul 22, 2024 | 3:28 PMUpdated Jul 22, 2024 | 3:28 PM
బాలయ్యని గట్టిగా వాడేస్తున్న అల్లు ఫ్యామిలీ! ఇప్పుడు మరో గుడ్ న్యూస్!

ఇండస్ట్రీలో హీరోల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుందని మనందరికి తెలిసిందే. ఆ స్నేహంలో భాగంగా అడగ్గానే సినిమాలకు వాయిస్ ఓవర్ లు ఇవ్వడం, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు గెస్ట్ లుగా వెళ్లడం ఇలా ఎన్నో విధాలుగా సాయం చేస్తుంటారు. ఈ సంప్రదాయం ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో వస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణను గట్టిగా వాడేస్తోంది అల్లు ఫ్యామిలీ. అంటే ఇదేదో నెగటీవ్ లో కాదండోయ్. పాజిటీవ్ లోనే. ఇక ఇప్పుడు అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. ఇది ఇటు అల్లు ఫ్యాన్స్ తో పాటుగా బాలయ్య అభిమానులను కూడా తెగ సంతోష పెడుతోంది.

‘బడ్డీ’.. మెగా హీరో అల్లు శిరీష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ చిత్రానికి సామ్ ఆంటోని దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిక్షనల్ కాన్సెప్ట్ తో సినీ లవర్స్ ను అలరించడానికి ఆగస్ట్ 2న రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీ ప్రీమియర్ షోలను వైజాగ్ లో తాజాగా వేశారు. ఈ షోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టెడ్డీ బేర్ చుట్టు ఈ కథ సాగుతుంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ సినిమాలో ఓ సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బడ్డీ సినిమాలో నందమూరి బాలకృష్ణను గట్టిగా వాడేసింది అల్లు ఫ్యామిలీ. ఈ మూవీలో బాలయ్య ఫేమస్ డైలాగ్ తో పాటుగా రిఫరెన్స్ కూడా ఉండనుంది. జై బాలయ్య  డైలాగ్ తో థియేటర్లు దద్దరిల్లుతాయని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది.

బడ్డీ సినిమాలో ఓ యాక్షన్ సీన్ సందర్భంగా జై బాలయ్య డైలాగ్ తో పాటుగా ‘భగవంత్ కేసరి’ మూవీలోని థీమ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందట. కాగా.. బాలయ్యకు అల్లు ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో బాలయ్య సూపర్ హిట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ చేసిన విషయం తెలిసిందే. ఆ షో ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతకు ముందు నుంచే అల్లు ఫ్యామిలీతో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. ఈ షో ద్వారా ఆ ప్రేమ ఇంకాస్త పెరిగింది. ఇప్పుడు అదే ప్రేమతో బాలయ్య డైలాగ్స్ ను బడ్డీ సినిమాలో వాడుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య డైలాగ్స్, థీమ్ మ్యూజిక్ వినిపించేటప్పుడు థియేటర్లు బ్లాస్ట్ అవుతాయని అంటున్నారు. ఇక ఈ మూవీలో అల్లు శిరీష్ ఫ్లైట్ కెప్టెన్ పాత్రలో నటిస్తుండగా.. రాజేష్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్ట్ 2న థియేటర్లలో బడ్డీ సందడి చేయనున్నాడు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio