iDreamPost
android-app
ios-app

AP-TG వరద బాధితులకు నాగార్జున- రామ్ చరణ్ భారీ విరాళం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బాధితుల్ని ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ ముందడుగు వేస్తుంది. ఇప్పటికే వీరికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తాజాగా చరణ్, నాగార్జున ఫ్యామిలీ డొనేషన్స్ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బాధితుల్ని ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ ముందడుగు వేస్తుంది. ఇప్పటికే వీరికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తాజాగా చరణ్, నాగార్జున ఫ్యామిలీ డొనేషన్స్ ప్రకటించారు.

AP-TG వరద బాధితులకు నాగార్జున- రామ్ చరణ్ భారీ విరాళం

ఆకాశానికి చిల్లులు పడ్డట్టు గత కొన్ని రోజులుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. రాకపోకలు సాగించేందుకు నానా ఇబ్బందులకు గురౌతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లు సముద్రాన్ని తలపించాయి. నడుంలోతులోకి నీళ్లు వచ్చి చేరాయి. ఇటు తెలంగాణలో పలు జిల్లాలు నీటమునిగాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరం జలదిగ్భంధంలో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా ఇండ్లలోకి వరద నీరు చేరడంతో భయాందోళనకు గురైన స్థానికులు.. ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు. తిండి, నీళ్లు, నిద్ర లేక అవస్థలు పడుతున్నారు ప్రజలు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపట్టినా కూడా కొంత మంది ఆహారం అందక ఆకలి కేకలు పెడుతున్నారు. అలాగే ఈ వరద ధాటికి పలువురు మృత్యువాత పడ్డారు. ఇక పంట నష్టం చెప్పనలవి కావు.

ఈ వరద నష్టం ఇరు రాష్ట్రాలను తీరని విషాదాన్ని మిగిల్చింది. కాగా, ఈ బాధితులను ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. ఒక్కొక్కరుగా తమ విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే బిగ్ స్టార్స్ తమ వంతు సాయాన్ని ఎనౌన్స్ చేయగా.. తాజాగా ఈ లిస్టులోకి వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున ఫ్యామిలీ. చరణ్ తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ఇరు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున అందజేస్తున్నట్లు పేర్కొన్నాడు. అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీల నుండి రూ. కోటి సాయం అందిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందించనున్నారు. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డొనేషన్‌ని అందజేస్తున్నాయి.

ఈ రోజు డార్లింగ్ ప్రభాస్, అల్లు అర్జున్, సోనూ సూద్ లాంటి స్టార్ హీరోలు తమ విరాళాన్ని ప్రకటించారు. ప్రభాస్, సోనూసూద్ ఇరు రాష్ట్రాలకు చెరో కోటి రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణ, ఏపీ సహాయనిధికి అల్లు అర్జున్ కోటి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వీరే కాదు.. ఈ జాబితాలోకి చాలా మంది సెలబ్రిటీలు డొనేషన్స్ అందించి, తమ పెద్ద మనస్సు చాటుకున్నారు. అందరి కన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ పండ్‌కు రూ. 50 చొప్పున అందిచనున్నట్లు తెలిపారు. ఆ వెంటనే హీరోలు వరుసగా ప్రకటనలు చేశారు. మెగా స్టార్ చిరంజీవి కోటి రూపాయల సాయంతో పాటు వరద బాధితులకు చేతనైన సాయం చేయాలని హితవు పలికారు. మహేష్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వంటి స్టార్స్ తమ వంతు సాయాన్ని ప్రకటించారు.