iDreamPost
android-app
ios-app

రజనీ కూలీ నుండి నాగార్జున పోస్టర్ రిలీజ్.. క్యూరియాసిటీ పెంచిన లోకేశ్ కనగరాజ్

  • Published Aug 29, 2024 | 5:48 PM Updated Updated Aug 29, 2024 | 5:48 PM

Nagarjuna: లోకేశ్ కనగరాజ్- రజనీకాంత్ మూవీ కూలీ మూవీలో భారీ కాస్టింగ్ సిద్దం అవుతుంది. ఇప్పటికే కన్నడ స్టార్ నటుడు ఉపేంద్రను రంగంలోకి దించితే.. ఇప్పుడు టాలీవుడ్ కింగ్ పోస్టర్ రిలీజ్ చేసి క్యూరియాసిటీని పెంచేశాడు దర్శకుడు.

Nagarjuna: లోకేశ్ కనగరాజ్- రజనీకాంత్ మూవీ కూలీ మూవీలో భారీ కాస్టింగ్ సిద్దం అవుతుంది. ఇప్పటికే కన్నడ స్టార్ నటుడు ఉపేంద్రను రంగంలోకి దించితే.. ఇప్పుడు టాలీవుడ్ కింగ్ పోస్టర్ రిలీజ్ చేసి క్యూరియాసిటీని పెంచేశాడు దర్శకుడు.

  • Published Aug 29, 2024 | 5:48 PMUpdated Aug 29, 2024 | 5:48 PM
రజనీ కూలీ నుండి నాగార్జున పోస్టర్ రిలీజ్.. క్యూరియాసిటీ పెంచిన లోకేశ్ కనగరాజ్

73 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్. జైలర్ మూవీతో దూకుడు పెంచిన ఆయన.. ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఏడాది లాల్ సలామ్ అంటూ ప్రేక్షకులను పలికరించగా.. బాక్సాఫీసు వద్ద బెడిసి కొట్టింది. అయినప్పటికీ వేగం తగ్గించలేదు.. రెట్టింపు చేశారు రజనీ. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో వెట్టియాన్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. దసరాకు ఈ మూవీ రాబోతుంది. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ మూవీ షురూ చేశాడు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఇదిలా ఉండే ఇప్పుడొక ఇంట్రస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు.

సైమన్ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్‌ను పంచుకున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకుని క్యారెక్టర్ లుక్ రివీల్ చేశారు. ఇందులో నాగార్జున రా అండ్ రస్టిక్ లుక్కులో దర్శనమిస్తున్నాడు. చేతికి గడియారం, కళ్లజోడు, స్టైలిష్ బియర్డ్‌లో మాస్ ఎలివేషన్‌లో కనిపిస్తున్నాడు నాగ్. చూడబోతే రజనీకాంత్‌ను ఢీ కొనే ఆంటోగనిస్టు పాత్రలో కింగ్ నాగార్జున కనిపించబోతున్నాడా అన్న డౌట్ కలుగుతుంది. ఇటీవల ఉపేంద్ర ఆన్ ది బోర్డు అంటూ రివీల్ చేసింది చిత్ర యూనిట్.  ఉపేంద్ర కూడా ఉండటంతో ఎవరు విలన్ రోల్ చేయనున్నారన్న ఆసక్తి నెలకొంది. చూడబోతే లోకేశ్ బిగ్ స్కెచ్చే వేసినట్లు కనిపిస్తుంది. కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్, శాండిల్ వుడ్ బాక్సాఫీసు మీద కన్నేశాడు ఈ యంగ్ డైరెక్టర్. సరికొత్త నాగ్ కనిపించబోతున్నాడని పోస్టర్‌ను బట్టే అర్థమౌతుంది.

Nagarjuna poster release from Rajini Coolie

రజనీ 171వ చిత్రంగా తెరకెక్కుతోన్న కూలీ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్స్ రంగంలోకి దింపాడు. ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహీర్ (మంజుమ్మల్ బాయ్స్), మహేంద్రన్ కనిపిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిథి మారన్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది నా సామి రంగా అంటూ బాక్సాఫీసును కుమ్మేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చేస్తున్నాడు. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. కుబేర నుండి కూడా నాగార్జున పోస్టర్ రిలీజయ్యింది. అంతలోనే అతని మాజీ మామ రజనీకాంత్ మూవీ నుండి నాగ్ ఫస్ట్ లుక్ రివీలయ్యింది. మొత్తానికి కోలీవుడ్ ప్రేక్షకులను కనువిందు చేసేందుకు ఫిక్స్ అయ్యాడు ఈ మన్మధుడు.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş