Naga Chaitanya- Sobhita Dhulipala Engagement: నిశ్చితార్థం అయిపోయింది.. ఫొటోలు షేర్‌ చేసిన నాగార్జున

నిశ్చితార్థం అయిపోయింది.. ఫొటోలు షేర్‌ చేసిన నాగార్జున

Naga Chaitanya- Sobhita Dhulipala Engagement: అక్కినేని నట వారసుడు, నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం నటి శోభితా దూళిపాళ్లతో గురువారం జరిగింది. ఈ ఫోటోలను షేర్ చేశారు అక్కినేని నాగార్జున.

Naga Chaitanya- Sobhita Dhulipala Engagement: అక్కినేని నట వారసుడు, నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం నటి శోభితా దూళిపాళ్లతో గురువారం జరిగింది. ఈ ఫోటోలను షేర్ చేశారు అక్కినేని నాగార్జున.

అక్కినేని నాగ చైతన్య- నటి శోభిత దూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ ఈ రోజు జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఉదయం 9.42 నిమిషాలకు వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరిగింది. కాగా, నాగ చైతన్యకు ఇది రెండో వివాహం. గతంలో టాలీవుడ్ స్టార్ నటి సమంతను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి విదితమే. సమంత- నాగ చైతన్య 2017లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ ఏడాది అక్టోబర్ 6-7 తేదీల్లో హిందూ, క్రిస్టీయన్ వివాహ పద్దతుల్లో వివాహం చేసుకున్నారు. అయితే 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ఆ తర్వాత చైతూ.. శోభితతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కొన్ని ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి. కానీ ఈ ఇద్దరు వీరి రిలేషన్ గురించి ఎక్కడా అఫీషియల్ ఎనౌన్స్ చేయలేదు. తాజాగా ఈ ఇద్దరు గురువారం ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ న్యూస్ నిజమైంది. ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments