iDreamPost
android-app
ios-app

నా గురించి ఎవరైనా ఏదైనా రాసినా కూడా.. నేను పెద్దగా రియాక్ట్ కాను.. నాగచైతన్య

దూత వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. నటుడు నాగచైతన్య ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. నా గురించి ఎవరైనా ఏదైనా రాసినా కూడా నేను పెద్దగా రియాక్ట్ కాను. మంచిగా రాస్తే హేపీగా ఫీలవుతాను. ఇంకేదైనా గనక రాస్తే కూడా బాధపడను అని తెలిపారు.

దూత వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. నటుడు నాగచైతన్య ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. నా గురించి ఎవరైనా ఏదైనా రాసినా కూడా నేను పెద్దగా రియాక్ట్ కాను. మంచిగా రాస్తే హేపీగా ఫీలవుతాను. ఇంకేదైనా గనక రాస్తే కూడా బాధపడను అని తెలిపారు.

నా గురించి ఎవరైనా ఏదైనా రాసినా కూడా.. నేను పెద్దగా రియాక్ట్ కాను.. నాగచైతన్య

దూత వెబ్ సిరీస్లో నాగచైతన్య జర్నలిస్టు పాత్రను పోషించడానికి, జర్నలిస్టుల జీవితాలను గట్టిగానే స్టడీ చేసినట్టు ఐ డ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తొలిసారి జర్నలిస్టు పాత్రను పోషించడం తనకెంతో ధ్రిల్ నిచ్చిందని, భలే ఎక్సైటింగ్గా అనిపించిందని వ్యక్తం చేశాడు. జర్నలిస్టుల జీవితాలను పరిశీలిస్తే వాళ్ళ జీవితాలలో ఉండే సాధకబాధకాలు కూడా తెలిశాయని అన్నాడు. ‘’ఒక న్యూస్ రాయాలంటే ఎంతో స్టడీ చేయాలి. న్యూస్ ఎంత గొప్పదైనా సరే దానిని ప్రజెంట్ చేయడానికి ఎంతో స్కిల్ ఉండి తీరాలి. అలాగే వాళ్ళ జీవితాలలో కూడా ఎన్నో సాధకబాధకాలుంటాయి. వాటిని దాటుకుని మరీ, ఎంతో డెడికేషన్తో వర్క్ చేస్తేగానీ, ఎవ్వరూ ఈ ప్రోఫెషన్లో రాణించలేరు. ముఖ్యంగా సినీ పరిశ్రమకి సంబంధించినంత వరకూ కూడా ప్రెస్ అండ్ ఇండస్ట్రీ రెండూ ఒకరి మీద ఒకరు ఆధారపడతారు, ఒకే ఫ్యామిలీలా మెలుగుతారు. మెలగాలి కూడా. అక్కినేని ఫ్యామిలీతో మీడియాకి మంచి అనుబంధం ఉంది. I love to do this character.’’ అన్నాడు చెయ్.

తర్వాత తన మీద ఎవరైనా విమర్శనాత్మకంగా రాసినా, కల్పించి రాసినా కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోనని లైటర్ వెయిన్ లో చెప్పడం ఇక్కడ ప్రత్యేకం. ఇటీవలి రోజులలో సమంతతో చెయ్ విడిపోయిన తర్వాత, అంతకు ముందు కూడా ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్ళు రాశారు. ఉన్నవి లేనివి అన్నట్టుగా వార్తల రూపంలో గాసిప్స్ గుప్పించారు. అప్పుడు కూడా నిజంగానే చెయ్ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. రియాక్ట్ కాలేదు. అంతా మౌనంగానే ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడు తప్పితే పర్సనల్ గా తీసుకోనేలేదు. ఏదైనా ఉంటేగింటే సమంత ట్వీట్లు గానీ, లేదా ఇతర మాధ్యమాలలో ఆమె వ్యక్తం చేసిన మాటలో దుమారం లేపాయి గానీ, చాయ్ మాత్రం నిశ్శబ్ద మంత్రాన్నే జపించాడు.

అది చెయ్ కి మాత్రం చాలా డిగ్నిటీని తెచ్చిపెట్టింది. ఒరిజినల్గానే చాలా సాఫ్ట్ అండ్ రిఫైన్డ్ నేచర్ ఉన్న్ చాయ్ ఆ ట్రబుల్డ్ టైంలో ప్రదర్శించిన సహనం జస్ట్ ఏన్ ఎగ్జాంపుల్. అదే చాయ్ మాటల్లో మళ్ళీ మరోసారి మాటల రూపంలో వినిపించింది. ‘’నా గురించి ఎవరైనా ఏదైనా రాసినా కూడా నేను పెద్దగా రియాక్ట్ కాను. మంచిగా రాస్తే హేపీగా ఫీలవుతాను. ఇంకేదైనా గనక రాస్తే కూడా బాధపడను. ఒక్క క్షణం ఆలోచిస్తాను. మరుక్షణమే మనసుని మరోదానివైపు మళ్ళించుకుంటాను. అంతే తప్పితే రాసిందానికి ప్రతీదానిని సీరియస్ గా తీసుకుని దాని గురించే పదేపదే ఆలోచించను’’ అని చెప్పాడు చెయ్. నిజమే మరి. చెయ్ చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.