iDreamPost
android-app
ios-app

Nabha Natesh: డార్లింగ్ మూవీలో నేను నా డ్రీమ్ రోల్ లో నటించాను: నభా నటేష్

  • Published Jul 14, 2024 | 1:34 PM Updated Updated Jul 14, 2024 | 1:34 PM

తెలుగు ఇండస్ట్రీలో అందం అభినయం ఉన్నా కూడా సరైన ఆఫర్స్ లేక.. కనుమరుగవుతున్న హీరోయిన్స్ ఎంతో మందిలో ఉన్నారు. వారిలో ఒకరు నభా నటేష్. ఇక ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంటుంది. ఈ క్రమంలో ఆమె మీడియాతో ముచ్చటించింది.

తెలుగు ఇండస్ట్రీలో అందం అభినయం ఉన్నా కూడా సరైన ఆఫర్స్ లేక.. కనుమరుగవుతున్న హీరోయిన్స్ ఎంతో మందిలో ఉన్నారు. వారిలో ఒకరు నభా నటేష్. ఇక ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంటుంది. ఈ క్రమంలో ఆమె మీడియాతో ముచ్చటించింది.

  • Published Jul 14, 2024 | 1:34 PMUpdated Jul 14, 2024 | 1:34 PM
Nabha Natesh: డార్లింగ్  మూవీలో  నేను నా డ్రీమ్ రోల్ లో నటించాను: నభా నటేష్

ఇండస్ట్రీలో ఎదో ఒకటి సాధించాలని.. ఎంతో కష్టపడుతున్న హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. వారిలో నభా నటేష్ కూడా ఒకరు. తీసింది కొన్ని సినిమాలే అయినా కూడా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది ఈ అమ్మడు. అయితే యాక్సిడెంట్ కారణంగా నభ మూవీస్ కు కాస్త గ్యాప్ తీసుకుంది. ఇక ఇప్పుడు వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే నభ తాజాగా నటించిన సినిమా “డార్లింగ్”. ఈ సినిమా జులై 19న థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది. దీనితో మూవీ టీం అంత ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నభ సినిమా గురించి మీడియా తో ముచ్చటించి.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

కాగా డార్లింగ్ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించగా.. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి నిర్మించారు. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉంది. కాబట్టి మూవీ టీం అంతా కూడా ప్రొమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నభ నటేష్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “దాదాపు రెండేళ్ల తర్వాత నేను నటించిన సినిమా థియేటర్స్ కు వస్తుంది. దీనితో ప్రేక్షకులు నన్ను చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్న. ఆడియన్స్ కు నా ఎనర్జీ అంటే ఇష్టం. అశ్విన్ చెప్పిన స్క్రిప్ట్ చాలా నచ్చింది. నా క్యారక్టర్ ఇంకా నచ్చింది. నాది చాలా చాలెంజింగ్ రోల్. ఈ రోల్ చేయడం నాకు బాగా నచ్చింది. నాకు ఇది డ్రీమ్ రోల్ లాంటిది.” అంటూ చెప్పుకొచ్చింది నభ నటేష్.

అంతే కాకుండా.. ఈ సినిమాలో ప్రియదర్శితో కలిసి నటించడం చాలా బాగుంది అని కూడా చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రీలిజ్ చేసిన ట్రైలర్స్ .. సినిమాపై బాగానే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి విడుదల తర్వాత ఈ సినిమా ఇలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇక నభ నటేష్ విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం నిఖిల్ తో పాటు “స్వయంభు” చిత్రంలో నటిస్తుంది. ఇది కాకుండా ఇంకా రెండు మూడు సినిమాలు లైన్ అప్ లో ఉన్నట్లు సమాచారం. మరి సినిమా విషయంలో నభ నటేష్ ముచ్చిటించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabet