iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి.. ఎందరో హృదయాలను గాయ పరిచిన హీరోయిన్.. గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలో టామ్ బాయ్ లా కనిపిస్తున్న చిన్నారి.. కుర్రాళ్ల కలల రాణి. తన నటనతో కుర్రాళ్ల గుండెల్ని గాయపరచడమే కాదూ.. గాయబ్ చేసిన హీరోయిన్. ఎవరూ అంటే..?

ఈ ఫోటోలో టామ్ బాయ్ లా కనిపిస్తున్న చిన్నారి.. కుర్రాళ్ల కలల రాణి. తన నటనతో కుర్రాళ్ల గుండెల్ని గాయపరచడమే కాదూ.. గాయబ్ చేసిన హీరోయిన్. ఎవరూ అంటే..?

ఈ చిన్నారి.. ఎందరో హృదయాలను గాయ పరిచిన హీరోయిన్.. గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలో బేబినీ గుర్తు పట్టారా..? ఫ్యాంట్ షర్ట్ వేసుకుని మగరాయుడిలా ఫోజ్ కొడుతుంది కదా. నుదిటిన తిలకం, చెవికి దిద్దులు లేకపోతే.. అబ్బాయే అనుకునేలా ఉంది. దిష్టి తగులుతుందని బుగ్గన చుక్క కూడా పెట్టారు. సైకిల్‌పై సవారి చేస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ గ్లామరస్ గాళ్. కానీ స్టార్ హీరోయిన్‌లా మారేందుకు ఆమెకు ఎక్కడో, ఏదో అడ్డు వస్తుంది. లేకుంటే యంగ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ హీరోయిన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు, గ్లామరస్ పాత్రలకు నో చెప్పని ఈ అమ్మడు.. వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నా.. లక్ కలిసి రావడం లేదు. ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే అరాచకం అయితే కుర్రాళ్లు నిద్రపోరంటే నమ్మండి. ఒక్క పాటతోనే యూత్ గుండెలను గాయపరిచిన ఈ బ్యూటీ ఎవరో గెస్ చేయగలరా..?

’అందం అమ్మాయేతే నీలా ఉందే అన్నట్లుందే.. మోమాటాటే వద్దన్నాయో అడగాలంటే కౌగిలే‘ ఈ వ్యాఖ్యం అమ్మడికి కచ్చితంగా సరిపోతుంది. ఆమె బ్యూటీ అలాంటిది మరీ. ఈమె కూడా కన్నడ కస్తూరినే. ఇంజనీరింగ్ చదివి.. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. భరత నాణ్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె..స్కూల్, కాలేజీ రోజుల్లోనే స్టేజ్ ఫెర్ఫ్మామెన్స్ ఇచ్చి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. మిస్ ఇండియా పోటీలకు కూడా వెళ్లి.. టాప్ 11 లిస్టులో ఆమె కూడా నిలిచింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార సరసన ఆడిపాడే తొలి ఛాన్స్ కొట్టేసింది. అక్కడ రెండు సినిమాలు చేశాక.. తెలుగులో సుధీర్ బాబు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. నభా నటేష్. చందన సీమలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. గంధపు చెక్కలా నిగనిగలాడుతూ ఉంటుంది.

నన్ను దోచుకుందువటే అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సోయగం.. అదుగో అనే చిత్రంలో నటించింది. కానీ ఆమెకు ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చిన చిత్రం.. ఇస్మార్ట్ శంకర్. ‘దిమ్మాక్ కరాబ్’ సాంగ్‌లో తన ఒంపు సొంపులు, హోయలతో నిజంగానే దిమ్మాక్ కరాబ్ చేసేసింది. రవితేజ సరసన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయి తేజ్‌తో జతకట్టింది. బెల్లకొండ గారి అబ్బాయి శ్రీనివాస్ సరసన అల్లుడు అదుర్స్ లో నటించింది. ఆ తర్వాత నితిన్ సరసన మ్యాస్ట్రోలో మెరిసింది. కానీ ఆమెకు సోలో హిట్ హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. ఇప్పటి వరకు ఏడు సినిమాలు చేస్తే.. నాలుగు మరో హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆమెది. ఇప్పుడు నితిన్ స్వయంభులో యాక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా మెయిన్ లీడ్ సంయుక్త మీనన్ నటిస్తుంది. అన్నీ ఉన్నా స్టార్ హీరోయిన్‌గా మారడానికి ఆమెకు సరైన ఛాన్స్ రాలేదనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి