iDreamPost
android-app
ios-app

అలా అంటే లై0గికంగా వేధించినట్టే.. ప్రియదర్శికి హీరోయిన్ వార్నింగ్

  • Published Apr 18, 2024 | 10:14 PM Updated Updated Apr 19, 2024 | 10:09 AM

నటుడు ప్రియదర్శిపై హీరోయిన్ నభా నటేష్ ఫైర్ అయ్యింది. అలా చేస్తే లైంగికంగా వేధించినట్టే అవుతుందని వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇలా ట్వీట్ చేయడానికి కారణం ఉంది.

నటుడు ప్రియదర్శిపై హీరోయిన్ నభా నటేష్ ఫైర్ అయ్యింది. అలా చేస్తే లైంగికంగా వేధించినట్టే అవుతుందని వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇలా ట్వీట్ చేయడానికి కారణం ఉంది.

  • Published Apr 18, 2024 | 10:14 PMUpdated Apr 19, 2024 | 10:09 AM
అలా అంటే లై0గికంగా వేధించినట్టే.. ప్రియదర్శికి హీరోయిన్ వార్నింగ్

ఇప్పుడు అంతా షార్ట్ అయిపోయింది. లైఫ్ తో పాటు గొడవలు కూడా షార్ట్ అయిపోయాయి. ఇంటి పక్కన ఉన్నవాళ్లతోనే కాదు ఎక్కడో వేరే కంట్రీలో ఉన్న వాళ్ళతో కూడా గొడవలు కామన్ అయిపోయాయి. కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియా పుణ్యమా అని మనుషులు మిత్రులు అవ్వడం సంగతి అలా ఉంచితే.. శత్రువులుగా మారుతున్నారు. ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం.. తిట్టుకోవడం చేసుకుంటున్నారు. ఈ డిజిటల్ వార్ పై పేటెంట్ రైట్స్ సామాన్యులకే కాదు.. మాకూ ఉంది అంటూ సెలబ్రిటీలు కూడా ముందుకొస్తున్నారు. వారిలో అభినవ్ గోమటం వర్సెస్ కల్పిక గణేష్, కల్పిక గణేష్ వర్సెస్ ధన్య బాలకృష్ణ, కస్తూరి వర్సెస్ నయనతార వంటి వారు ఉన్నారు.

ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తనపై రాయి వేసిన బాలీవుడ్ యాక్టర్ పై ఓ రేంజ్ లో రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా వెర్షన్ పక్కన పెడితే.. నటుడు ప్రియదర్శిపై హీరోయిన్ నభా నటేష్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. నభా నటేష్ గురించి మనకి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. తాజాగా ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ప్రభాస్ డైలాగ్స్ కి లిప్ సింక్ ఇస్తూ ఆ వీడియోని షేర్ చేసింది. హాయ్ డార్లింగ్స్, హౌ ఆర్ యూ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. నెటిజన్స్ హాయ్ డార్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నటుడు ప్రియదర్శి కూడా ఈ వీడియోపై స్పందించారు. ‘వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ ఉన్నావ్ డార్లింగ్’ అంటూ ప్రియదర్శి రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి స్పందించిన నభా నటేష్.. ‘మిస్టర్ కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త’ అంటూ ఒక ఇమేజ్ ని షేర్ చేసింది. ఆ ఇమేజ్ లో ‘పరిచయం లేని అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం ఐపీసీ సెక్షన్ 354ఏ ప్రకారం లైంగిక వేధింపులతో సమానం: కలకత్తా హైకోర్టు’ అని రాసి ఉంది.

దానికి ప్రియదర్శి బదులిస్తూ.. ‘మనం పరిచయం లేని వ్యక్తులన్న విషయం నాకు తెలియదు. బై ద వే.. మీరు డార్లింగ్ అనచ్చు.. మేము అంటే సెక్షన్ 354ఏ ఐపీసీనా? లైట్ తీసుకో డార్లింగ్’ అంటూ రాసుకొచ్చారు. దానికి నభా నటేష్ స్పందిస్తూ.. ‘ఆహా.. హద్దు దాటి ప్రవర్తించకు.. చూసుకుందాం’ అంటూ రాసుకొచ్చింది. దానికి ప్రియదర్శి స్పందిస్తూ.. ‘ఓహో.. వై దిస్ కొలవెరి’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ వైరల్ గా మారాయి. ఇక నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాల్లో నటించింది.

ఆ తరువాత ఆమె కొన్ని రోజులు సినిమాలకు దూరమయ్యారు. దీనికి కారణం ఆమెకు 2022లో రోడ్డు ప్రమాదం జరగడమే. దాని వల్ల ఆమె ఎడమ భుజానికి గాయమైంది. చాలా శస్త్ర చికిత్సలు జరిగాయని.. మానసికంగా, శారీరకంగా చాలా బాధను అనుభవించా అని ఒక లేఖలో రాసుకొచ్చింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా అని.. ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె ఎక్స్ ఖాతాలో వీడియో షేర్ చేస్తూ అలరించింది. దీనికి ప్రియదర్శి కామెంట్స్ చేస్తూ స్వీ/ట్వీట్ వార్ కి కారణమయ్యారు. అయితే ఇది ప్రమోషనల్ స్టంట్ లో భాగంగా చేసి ఉంటారని కొంతమంది భావిస్తున్నారు.  లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రమోషన్ లో భాగమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అవును వీళ్ళ ట్వీట్స్ చూస్తుంటే ప్రమోషనల్ స్టంట్ లో భాగమే అని ఇట్టే అర్ధమైపోతుంది. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు. నభా నటేష్ సీరియస్ గానే ప్రియదర్శికి వార్నింగ్ ఇచ్చిందని అనుకుంటున్నారా? లేక సరదాగా చేసిందని అనుకుంటున్నారా?

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom