iDreamPost
android-app
ios-app

Movie: OTTలోకి నా సామిరంగా.. హాట్ స్టార్ నుండి ఇంట్రెస్టింగ్ ట్వీట్!

  • Published Feb 08, 2024 | 4:41 PM Updated Updated Mar 14, 2024 | 5:02 PM

కింగ్ నాగర్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ. ఈ సినిమా సంక్రాతి కానుకగా విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మరో వారం రోజుల్లో ఓటీటీలో సందడి చేయనుంది. ఇంతకి ఎప్పుడంటే..

కింగ్ నాగర్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ. ఈ సినిమా సంక్రాతి కానుకగా విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మరో వారం రోజుల్లో ఓటీటీలో సందడి చేయనుంది. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Feb 08, 2024 | 4:41 PMUpdated Mar 14, 2024 | 5:02 PM
Movie: OTTలోకి నా సామిరంగా.. హాట్ స్టార్ నుండి ఇంట్రెస్టింగ్ ట్వీట్!

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాను దర్శకుడు విజయ్ బిన్నీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో తెరకెక్కించారు. సంక్రాతి కానుకగా జనవరి 13న విడుదలైన నా సామిరంగ సూపర్ సక్కెస్ ను అందుకుంది. ఇందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాతో నాగ్ మరోసారి తన మాస్ యాక్టింగ్ తో అలరించాడు. కాగా, సంక్రాతికి విడుదలైన స్టార్ హీరోల సినిమాలన్ని ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే నాగ్ నటించిన నా స్వామిరంగ త్వరలో ఓటీటీలో అలరించబోతుందనే ప్రచారమే తప్ప, ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. కానీ, నాగ్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా నా స్వామిరంగ సినిమా మరో వారం రోజుల్లో ఓటీటీలోకి అందుబాటులో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అది ఎప్పుడంటే..

ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ గా ప్రేక్షకుల మెప్పు పొందిన ‘నా సామిరంగ’ మూవీ థియేటర్లలో సూపర్‌ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డిజిటిటల్ స్ట్రీమింగ్ హక్కులకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే నాగర్జున నా సామిరంగ మూవీ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు హాట్ స్టార్ లో వీడియోను కూడా రిలీజ్ చేసింది. కానీ స్ట్రీమింగ్ డేట్ పై మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కాగా, నా సామిరంగ సినిమా ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

naa saami ranga into ott

ఇక నా సామిరంగ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించగా.. శ్రీనివాస్ చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. అలాగే ఇందులో నాజర్, మలయాళ నటుడు షబ్బీర్‌ కలరక్కాల్‌, రవి వర్మ, రావు రమేశ్‌, మధు సూదన్‌ రావ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, థీయేటర్లలో మంచి కలెక్షన్స్ ను కొల్లగొట్టిన నా సామిరంగకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి. మరి, నాగర్జున నటించిన నా సామిరంగ మూవీ మరో వారం రోజుల్లో ఓటీటీలో అలరించబోతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio