iDreamPost
android-app
ios-app

Mythri Movie Makers: ఆ హిట్ మూవీ డైరెక్టర్ తో మైత్రి మేకర్స్ డీల్.. ఎవరంటే !

  • Published Jul 20, 2024 | 7:55 PM Updated Updated Jul 20, 2024 | 7:55 PM

ప్రస్తుతం ఎక్కడా చూసినా కానీ పాన్ ఇండియా మూవీ ట్రెండ్ నడుస్తుంది. అన్ని భారీ బడ్జెట్ సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో మైత్రి సంస్థ ఓ హిట్ డైరెక్టర్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీకి డీల్ కుదుర్చుకుందట. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం ఎక్కడా చూసినా కానీ పాన్ ఇండియా మూవీ ట్రెండ్ నడుస్తుంది. అన్ని భారీ బడ్జెట్ సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో మైత్రి సంస్థ ఓ హిట్ డైరెక్టర్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీకి డీల్ కుదుర్చుకుందట. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 20, 2024 | 7:55 PMUpdated Jul 20, 2024 | 7:55 PM
Mythri Movie Makers: ఆ హిట్ మూవీ డైరెక్టర్ తో మైత్రి మేకర్స్ డీల్.. ఎవరంటే !

ఇప్పటికే ఇండస్ట్రీల్లో చాలానే భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యి.. అనుకున్నట్లుగాన్నే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం లాంటివి ఎన్నో చూశాం. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్ పాన్ ఇండియా మూవీస్. అన్ని భాషల ఆడియన్సును ఆకట్టుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. దీనితో ఇండస్ట్రీ మార్కెట్ రేంజ్ కూడా బాగానే పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం నిర్మాతలు.. టాలెంటెడ్ డైరెక్టర్స్ ను వేటాడే పనిలో ఉన్నారు. ఏదైనా ఓ మూవీ భారీ హిట్ ను ఎందుకంటే చాలు.. వెంటనే ఆ మూవీ డైరెక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చి ముందే డీల్ కుదుర్చుకుంటున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్.. ఓ హిట్ డైరెక్టర్ తో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఏదంటే.. ముందుగా వినిపించే పేరు మైత్రి మూవీ మేకర్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ మార్కెట్ ను పెంచే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ ను ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా ఓ మూవీ, హిందీలో సన్నీ డియోల్ మెయిల్ లీడ్ లో ఓ మూవీ, మలయాళంలో ఓ మూవీ.. అలాగే టాలీవుడ్ అగ్ర హీరోలు.. ప్రభాస్ , రామ్ చరణ్ , తారక్ లతో మరి కొన్ని మూవీస్ .. మైత్రి మూవీ మేకర్స్ తో లైన్ అప్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలే కాకుండా.. ప్రస్తుతం మరొక హిట్ డైరెక్టర్ కు కూడా అడ్వాన్స్ ఇచ్చి డీల్ కుదుర్చుకుందట ఈ ప్రొడక్షన్ హౌస్. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. మంజుమ్మేల్ బాయ్స్ సినిమాతో భారీ హిట్ అందుకున్న దర్శకుడు చిదంబరం. ఈ డైరెక్టర్ కు మైత్రి సంస్థ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ మాట్లాడుకుందట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

ఇక డైరెక్టర్ చిదంబరం విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ దర్శకుడు.. హిందీలో ఓ మూవీని చేస్తున్నాడు. ఆ సినిమా స్క్రిప్ట్ వరకు ఇప్పుడు జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్సుమెంట్ రానుంది. ఈ మూవీ పూర్తైన తర్వాత.. చిదంబరం మైత్రి మూవీ మేకర్స్ తో మూవీ చేయనున్నారు. ఈ మూవీస్ పై మరిన్ని అప్ డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. అలాగే ఈ దర్శకుడు కాకుండా.. మనసా నమః అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ దీపక్ రెడ్డితో కూడా.. మైత్రి మూవీ మేకర్స్ ఓ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధిచిన స్క్రిప్ట్ వర్క్ ప్రాసెస్ లో ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్సుమెంట్ రానుంది. కాబట్టి రానున్న రోజుల్లో మైత్రి మూవీ మేకర్స్ నుంచి చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు రానున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş