iDreamPost
android-app
ios-app

బాబీ- బాలయ్య మూవీపై తమన్ లీకులు.. పండగే అంటూ..!

  • Published Aug 04, 2024 | 3:26 PM Updated Updated Aug 04, 2024 | 3:26 PM

Music Director SS Thaman Crazy Comments on Balayya And Bobby Movie: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తాను చేస్తున్న ప్రాజెక్టులపై తమన్ కొన్ని క్రేజీ కామెంట్స్ చేశాడు.

Music Director SS Thaman Crazy Comments on Balayya And Bobby Movie: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తాను చేస్తున్న ప్రాజెక్టులపై తమన్ కొన్ని క్రేజీ కామెంట్స్ చేశాడు.

  • Published Aug 04, 2024 | 3:26 PMUpdated Aug 04, 2024 | 3:26 PM
బాబీ- బాలయ్య మూవీపై తమన్ లీకులు.. పండగే అంటూ..!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. అలాగే ఇండియన్ ఐడల్ సీజన్ 3కి కూడా జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు టాలీవుడ్ లోనే కాకుండా.. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలో కూడా తమన్ బిజీగానే ఉంటాడు. బేబీ జాన్ తో మరోసారి హిందీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయాడు. అయితే తమన్ అప్పుడప్పుడు తన ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని లీకులు ఇస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించి తమన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి. ముఖ్యంగా బాలయ్య- బాబీ మూవీ గురించి అయితే హైప్ ఎక్కించేశాడు.

టాలీవుడ్ లో ఇప్పుడు తమన్ అత్యంత బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. బాలయ్య, పవన్, రవితేజ, ప్రభాస్, రామ్ చరణ్, సిద్ధు జొన్నలగడ్డ ప్రాజెక్టులకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాను చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి తమన్ అప్పుడప్పుడు కొన్ని లీకులు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగానే కొన్ని ప్రశ్నలకు తమన్ తనదైనశైలిలో సమాధానాలు చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది జనవరిలో ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం ఉంది అన్నాడు. అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి మరో పాట ఎప్పుడు అంటే.. ఆగస్టు నెలాఖరుకు సాంగ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు.

ఇంక పవన్ కల్యాణ్- సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీకి సంబంధించి కూడా తమన్ రియాక్ట్ అయ్యాడు. షూటింగ్ హోల్డ్ లో ఉంది కాబట్టి.. ఇప్పుడల్లా అప్ డేట్స్ ఉండే అవకాశం లేదు అని అంతా అనుకుంటున్నారు. అయితే ఫస్ట్ సింగిల్ కి సంబంధించి సుజిత్ తో తమన్ డిస్కషన్ జరిగిందంట. త్వరలోనే ఫస్ట్ సింగిల్ కి సంబంధించి అప్ డేట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇంక బాలయ్య- బాబీ కొల్లి చిత్రానికి సంబంధించి తమన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేస్తున్నాయి. ఎందుకంటే ఎన్బీకే 109 మూవీ రష్ తాను చూసినట్లు తమన్ తెలిపాడు. బాలయ్య అభిమానులకు ఈ మూవీ పెద్ద పండగ అంటూ చెప్పడం వైరల్ గా మారింది. ఈ మూవీ కచ్చితంగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ నే తరహాలో తమన్ చేసిన వ్యాఖ్యలు బాలయ్య ఫ్యాన్స్ లో కొత్త జోష్ పెంచాయి. మరి.. తమన్ చేసిన ఈ లీకులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss