iDreamPost
android-app
ios-app

హాస్పిటల్ బెడ్ పై ఆర్. నారాయణ మూర్తి! ఏమైందంటే?

  • Published Jul 17, 2024 | 4:42 PM Updated Updated Jul 17, 2024 | 9:32 PM

R Narayana Murthy admitted to hospital: పీపుల్స్ స్టార్, సీనియర్ యాక్టర్, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

R Narayana Murthy admitted to hospital: పీపుల్స్ స్టార్, సీనియర్ యాక్టర్, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 17, 2024 | 4:42 PMUpdated Jul 17, 2024 | 9:32 PM
హాస్పిటల్ బెడ్ పై ఆర్. నారాయణ మూర్తి! ఏమైందంటే?

సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురికావడంతో.. బుధవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు సన్నిహితులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆర్. నారాయణ మూర్తి.. వరుసగా విప్లవ సినిమాలను తెరకెక్కించి.. ‘పీపుల్స్ స్టార్’గా గుర్తింపు పొందారు. కాగా.. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురౌతూ వస్తున్నారు. తాజాగా అస్వస్థతకు గురికావడంతో.. బుధవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు సన్నిహితులు తెలిపారు. డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో నారాయణ మూర్తికి వైద్యం చేస్తున్నారు. ఇక పీపుల్స్ స్టార్ కెరీర్ విషయానికి వస్తే.. గతంలో ఆయన నటించి, నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. కానీ గత కొంతకాలంగా ఆయన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి. ఇక చాలా గ్యాప్ తీసుకుని ‘యూనివర్సిటీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ అది అంత సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో.. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పీపుల్స్ స్టార్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss