iDreamPost
android-app
ios-app

మురారి రీ-రిలీజ్ క్రేజ్.. ఏకంగా పెళ్లి పత్రిక రెడీ చేసి..!

  • Published Jul 18, 2024 | 6:47 PM Updated Updated Jul 18, 2024 | 6:47 PM

Murari Movie Re Release Invitation: ఇప్పుడు కొత్త సినిమాల సంగతి ఎలా ఉన్న సరే.. రీరిలీజ్ లకు మాత్రం విపరీతమైన క్రేజ్ నడుస్తుంది. ఇప్పటివరకు ఎన్నో రిరిలీజ్ మూవీస్ వచ్చాయి కానీ.. ఇప్పుడు రీరిలీజ్ కాబోతున్న మూవీకి మాత్రం వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Murari Movie Re Release Invitation: ఇప్పుడు కొత్త సినిమాల సంగతి ఎలా ఉన్న సరే.. రీరిలీజ్ లకు మాత్రం విపరీతమైన క్రేజ్ నడుస్తుంది. ఇప్పటివరకు ఎన్నో రిరిలీజ్ మూవీస్ వచ్చాయి కానీ.. ఇప్పుడు రీరిలీజ్ కాబోతున్న మూవీకి మాత్రం వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

  • Published Jul 18, 2024 | 6:47 PMUpdated Jul 18, 2024 | 6:47 PM
మురారి రీ-రిలీజ్ క్రేజ్.. ఏకంగా పెళ్లి పత్రిక రెడీ చేసి..!

2001 ఫిబ్రవరి 17 న.. దర్శకుడు కృష్ణ వంశీ రూపొందించిన అద్భుత చిత్రం “మురారి” థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 23 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికి టీవీ లో ఈ సినిమా వస్తుందంటే.. కదలకుండా కూర్చుని చూస్తూ ఉంటారు. ఓ మంచి క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా మురారి సినిమా ఎప్పటికి.. మూవీ లవర్స్ మదిలో నిలిచిపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు.. ఇప్పటికీ అందరి ప్లే లిస్ట్ లో ఆల్ టైమ్ ఫేవరేట్ గా నిలిచిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఇక ఇప్పుడు 23 ఏళ్ళ తర్వాత.. ఆగష్టు 9 న మహేష్ పుట్టిన రోజు సందర్బంగా ఈ మూవీ రీరిలీజ్ కానుంది. ఈ రీరిలీజ్ కోసం ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

సోషల్ మీడియాలో ఇప్పటికే ఆల్రెడీ ఈ వీడియోను చూసే ఉంటారు. అరే ఇదేంటి ఇలా కూడా చేస్తారా అని అనుకునే ఉంటారు. అదే మురారి మూవీ రిరిలీజ్ ఆహ్వాన పత్రిక . ఇన్విటేషన్స్ ఉండేది పెళ్లిళ్లకు , ఫంక్షన్స్ కు కదా ఉండేది.. ఇలా మూవీస్ కు కూడా ఉంటాయా అంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ అదే. ఒక రీరిలీజ్ సినిమాకు ఈ రకంగా ఫ్యాన్స్ ప్రమోషన్స్ చేయడం అనేది బహుశా ఇదే మొదటి సారి అయ్యి ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో మూవీస్ రీరిలీజ్ అయ్యాయి.. అయితే ఆ సినిమాలు రిలీజ్ అయినా తర్వాత ఆ సినిమా జోరు సోషల్ మీడియాలో కనిపించేది.. కానీ ఇప్పుడు మాత్రం రిలీజ్ కు ముందే.. మురారి మూవీ ఒక సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా.. మురారి వెడ్స్ వసుంధర, ఆగష్టు 9 న ముహూర్తం , ఘట్టమనేని వారి వివాహం అంటూ.. ఒక పెళ్ళికి ఎలా అయితే ఆహ్వాన పత్రికను సిద్ధం చేస్తారో .. దానికి ఏ మాత్రం తీసిపోకుండా.. ఈ రీరిలీజ్ ఇన్విటేషన్ ను రెడీ చేశారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక మురారి సినిమా.. రన్ టైమ్ ను తగ్గించారట మేకర్స్. సుమారు 18 నిమిషాల మూవీని ట్రిమ్ చేసినట్లు సమాచారం. అంటే ఈ సినిమా మొత్తం 2 గంటల 42 నిమిషాల రన్‍టైమ్‍తో.. ఆగష్టు 9 న థియేటర్స్ లో రీరిలీజ్ కానుంది. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే.. సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో ట్రెండ్ కొనసాగుతుంది. ఇక రిలీజ్ అయ్యాకా థియేటర్స్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ కూడా ఓ మ్యూజికల్ కాన్సర్ట్స్ లా మారిపోతాయని చెప్పడంలో.. ఏ మాత్రం సందేహం లేదు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని ఈ సినిమాను వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేష్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss